దిల్ రాజు సెల్ఫ్ గోల్..మళ్ళీ బుక్కయ్యాడుగా..!

Dil Raju

గత కొన్ని రోజులు కితం ఓ యువ హీరో సినిమా విషయంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అయినటువంటి దిల్ రాజు చేసిన పని అంటూ ఓ షాకింగ్ అంశం పెద్ద ఎత్తున దుమారం లా మారింది. మరి అయితే ఆ సినిమా “కార్తికేయ 2” కాగా ఆ సినిమా హీరో నిఖిల్ తన బాధను చెప్పుకోవడం సర్వత్రా షాకింగ్ గా మారింది.

ఇన్నేళ్ళలో ఎప్పుడు నా సినిమా రిలీజ్ పట్ల ఇంత ఇబ్బంది పడలేదు అని మొదటిసారి ఇలా అవుతుంది అని చెప్పాడు. దీనితో ఈ సినిమా రిలీజ్ కి రావాల్సిన డేట్ కి సరిగ్గా అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన “థాంక్ యూ” దిల్ రాజు నిర్మించిన సినిమా కావడంతో థియేటర్స్ ఇవ్వకుండా బ్లాక్ చేశారు.

దీనితో ఇక తప్పనిసరి పరిస్థితిలో వేరే డేట్ కి వచ్చినా మళ్ళీ దాని నుంచి ఓ కొత్త డేట్ కి మార్పించారు. అయితే దీని వెనుక ఉంది దిల్ రాజే అని అందరికీ తెలియనిది కాదు. అయితే లేటెస్ట్ గా కార్తికేయ 2 సక్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతు పలు కామెంట్స్ చేశారు.

అయితే ఇందులో ఓపెన్ గానే తాను కార్తికేయ 2 కి అడ్డు పడ్డానని చెప్పినట్టు అయ్యింది. కానీ మళ్ళీ అన్ని సినిమాలు మాకు ఒకటే అని చెప్పడమే అంత సమంజసంగా ఎవరికీ అనిపించడం లేదు. అంత ఉదారత ఉన్నట్టయితే అప్పుడు ఎందుకు ఇబ్బంది పెట్టడం ఇప్పుడెందుకు ఇలా మాట్లాడి మళ్ళీ బుక్కవ్వడం అంటూ పలువురు పెదవి విరుస్తున్నారు.