కన్నుగీటిన కొంటెపిల్లగా ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్.. త్వరలో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. అన్నీ అనుకున్నట్టుగా సాగితే.. నాని సరసన హీరోయిన్‌గా ఛాన్స్ రావడం ఖాయం. ఏస్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన విక్రమ్ కుమార్ తన నెక్స్ట్ మూవీలో ప్రియా ప్రకాశ్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నారనేది ఫిల్మ్‌నగర్ టాక్.
నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతోంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతోందట. ఇందులో మేఘా ఆకాశ్‌తో పాటు ప్రియా ప్రకాశ్‌ను కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే- ఈ మలయాళ కుట్టికి ఇదే తొలి తెలుగు చిత్రం అవుతుంది.
ఈ సినిమాలో సిద్ధార్థ కీలక పాత్రను పోషించబోతున్నారని అంటున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల 19వ తేదీ నుంచి ఆరంభం కానుంది. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలను తీయడం విక్రమ్ కె కుమార్‌కు ఉన్న టాలెంట్ ఎలాంటిదో మనకు తెలుసు.
మాధవన్ హీరోగా తెరకెక్కిన `13బి` సినిమాను ఎప్పటికీ మరిచిపోలేం. మలయాళంలో ఆమె నటించిన `ఒరు ఆదార్ లవ్‌స్టోరీ` తెలుగులో లవర్స్ డే పేరుతో డబ్ అవుతోంది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈ సినిమాను వచ్చేనెల 14వ తేదీన విడుదల చేయనున్నారు.