కన్ను కొట్టిన కష్టం వృధా పోలేదు… టాప్ వచ్చింది

ఒక్క సారి కన్నుగీటి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది ప్రియా ప్రకాష్‌ వారియర్‌. మళయాళ చిత్రం ‘ఒరు అదార్ లవ్‌’ చిత్రంలోని ‘మాణిక్య మలరయ’ అనే పాటలో ప్రియా కన్నుకొడుతూ ఎక్సప్రెషన్స్ పలికిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ఏ స్థాయిలో వైరల్‌గా మారిందో తెలిసిందే. కన్నుకొట్టి, గన్నుతో పేల్చి కుర్రోళ్ల గుండెలను కొల్లగొట్టేసిందీ భామ. ఈమె మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈ సారి కన్ను గీటో..మరొకటి చేసో కాదు..ఇది ఆమె పాపులారిటికి సంభందించిన వార్త.

అదేమిచంచే,, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌.. 2018లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన సెలబ్రిటీగా నిలిచారు. ఇక కేవలం చిన్న ట్రైలర్ రిలీజ్ తో ఆమె జాతకం మారిపోయింది. ట్రైలర్ రాగానే… ఆ సినిమా విడుదలకు ముందే ప్రియా దేశవ్యాప్తంగా పాపులర్‌ అయిపోయారు. అల్లు అర్జున్‌, రిషి కపూర్‌లాంటి స్టార్స్ అందరి మెప్పుపొందారు.

ఈ వీడియో విడుదలయ్యాక నెటిజన్లు ప్రియా గురించి గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారట. అలా ఆమె గూగుల్‌లో అత్యధిక మంది సెర్చ్‌ చేసిన భారతీయ సెలబ్రిటీగా మొదటి స్థానం సంపాదించుకున్నారు. రెండో స్థానంలో ప్రముఖ భారతీయ నృత్యకారిణి సప్నా చౌదరి ఉన్నారు.

మూడో స్థానంలో బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ భర్త ఆనంద్‌ అహూజా, నాలుగో స్థానంలో ప్రియాంక చోప్రా నిలిచారు. గూగుల్‌లో నెటిజన్లు సెర్చ్‌ చేసిన టాప్‌ ఐదు టర్మ్స్‌లో.. వాట్సాప్‌లో స్టిక్కర్లు ఎలా పంపాలి? ఫోన్‌ నెంబరుతో ఆధార్‌ను ఎలా లింక్‌ చేయాలి? రంగోలీ ఎలా వేయాలి? బిట్‌కాయిన్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి? మొబైల్‌ నెంబర్‌ను ఎలా పోర్ట్‌ చేసుకోవాలి? లాంటి ప్రశ్నలు ఉన్నాయి.