A – ఆదిపురూష్ లో ‘అతన్ని’ తీసుకోవాల్సిందే.. పట్టుబడుతున్న ప్రభాస్..!!

prabhas forcing adipurush movie unit to take rana in the film

ఆదిపురుష్ సినిమా అనౌన్స్ మెంట్ అయిపోయింది. ఇక.. ఆ సినిమాకు సంబంధించిన కొత్త కొత్త అప్ డేట్స్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముందుగా ఆ సినిమా పోస్టర్ ద్వారా సినిమా రామాయణం మీద ఉంటుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత సినిమా రామాయణం మీదనే ఉంటుందని కన్ఫమ్ అయింది. ఆ తర్వాత ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడని తెలిసింది. ఆ తర్వాత సినిమా బడ్జెట్ 1000 కోట్లని తెలిసింది. ఆ తర్వాత సినిమాలో విలన్ పాత్రకు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ను తీసుకోనున్నట్టు తెలిసింది. ఆ తర్వాత సినిమాలో సీత పాత్రకు మహానటి కీర్తి సురేశ్ ను తీసుకున్నట్టు తెలిసింది.

prabhas forcing adipurush movie unit to take rana in the film
prabhas forcing adipurush movie unit to take rana in the film

ఇలా.. రోజురోజుకూ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ తెలుస్తూనే ఉన్నాయి. ఆ అప్ డేట్స్ ఎలా ఉన్నాయంటే… ప్రభాస్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి.

ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ తెరకెక్కించనుండగా… 2021 లో సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ సినిమా.. 2022లో రిలీజ్ కానుంది.

ఇక.. ఈ సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ ఏంటంటే.. ప్రభాస్.. ఈ సినిమాలో రానా దగ్గుబాటిని కూడా తీసుకోవాలని మూవీ యూనిట్ కు సూచించాడట. సూచించడమే కాదు.. ఖచ్చితంగా రానా ఈ ప్రాజెక్టులో ఉండాలని చెప్పాడట. ఇంకోరకంగా చెప్పాలంటే డిమాండ్ చేశాడనే చెప్పాలి.

మరి.. అది విలన్ రోల్ కోసమా? లేక మరేదైనా ముఖ్యమైన రోల్ కోసమా అనేది తెలియదు కానీ.. రానా మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులో ఉండి తీరాల్సిందేనని ప్రభాస్ తేల్చి చెప్పాడట. ప్రస్తుతం ఫిలింనగర్ లో ఈ టాపికే తెగ హల్ చల్ చేస్తోంది.

బాహుబలి సిరీస్ లో రానా, ప్రభాస్ మధ్య కెమిస్ట్రీ బాగా పండటమే కాదు.. వీళ్లిద్దరు జాన్ జిగ్రీలుగా మారారు. అందుకే.. ప్రభాస్.. రానాను ఈ ప్రాజెక్ట్ కు తీసుకోవాలనే కండీషన్ పెట్టినట్టు తెలుస్తోంది. చూద్దాం.. మరి.. రానా కూడా ఈ సినిమాలో నటిస్తాడో? లేదో?