Home Tollywood ఫుల్ జోష్ మీద ఉన్న పవన్ కల్యాణ్ ఫాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్ ?

ఫుల్ జోష్ మీద ఉన్న పవన్ కల్యాణ్ ఫాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్ ?

ఫుల్ జోష్ మీద ఉన్న పవన్ కల్యాణ్ ఫాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్ ?…..`వ‌కీల్ సాబ్` చిత్రాన్ని ప్ర‌క‌టించిన‌ది మొద‌లు బ్యాక్ టు బ్యాక్ స్క్రిప్టుల్ని ఫైన‌ల్ చేసి ద‌ర్శ‌కుల్ని ప్ర‌క‌టించేస్తుంటే అంతా షాక్ తిన్నారు. ప‌వ‌ర్ స్టార్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. పీఎస్‌పీకే 27 క్రిష్ తో .. పీఎస్‌పీకే 28 హ‌రీష్ శంక‌ర్ తో ఉంటాయ‌ని ప్ర‌చార‌మైంది.

Powerstar Big Jolt To Gabbarsingh Director Harish Shankar
powerstar big jolt to gabbarsingh director harish shankar

కానీ ఇంత‌లోనే మ‌రో కొత్త ప్ర‌చారం టాలీవుడ్ స‌ర్కిల్స్ స‌హా ప‌వ‌న్ అభిమానుల్ని హీటెక్కిస్తోంది. క్రిష్ త‌ర్వాత హ‌రీష్ కి ఛాన్స్ లేద‌ని అంత‌కంటే ముందే సురేంద‌ర్ రెడ్డితో రామ్ తాళ్లూరి సినిమాకి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌న్న‌ది ఆ వార్త సారాంశం. సైరా న‌ర‌సింహారెడ్డి లాంటి పాన్ ఇండియా సినిమాని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడిగా సూరి అంటే మెగా కాంపౌండ్ లో గౌర‌వం ఉంది. అందుకే అత‌డికి తొలి ప్రాధాన్య‌త‌నిచ్చార‌ట ప‌వ‌న్.

మ‌రింత డీప్ ఇన్ఫో ఏమిటంటే.. కేవ‌లం హ‌రీష్ కే కాదు.. క్రిష్ కి కూడా పంచ్ ప‌డిపోనుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే క‌రోనా క్రైసిస్ వ‌ల్ల క్రిష్ భారీ పాన్ ఇండియా ఫిలింకి బ‌డ్జెట్లు స‌ర్ధ‌లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ట‌. దాంతో ఆ ప్రాజెక్టుకు కొంత‌కాలం బ్రేక్ ఇచ్చేసి నేరుగా సురేంద‌ర్ రెడ్డితో సెట్స్ కెళ్లాల‌ని ప‌వ‌న్ ప్లాన్ చేస్తున్నారంటూ ప్ర‌చారం సాగుతోంది.

ప‌వ‌న్ తో క్రిష్ హిస్టారిక‌ల్ నేప‌థ్యం ఉన్న సినిమా చేస్తున్నాడు. కోహినూర్ వ‌జ్రం దొంగ‌త‌నం అనే కాన్సెప్టుతో వెళుతున్నాడు. దీనికి వీఎఫ్ ఎక్స్ కోసం చాలా స‌మ‌యం ప‌డుతుంది. భారీ పెట్టుబ‌డులు ఫైనాన్స్ అవ‌స‌రం. అందుకే అత‌డు కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చి .. వైష్ణ‌వ్ తేజ్ తో సినిమా చేసే వీలుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇవ‌న్నీ నిజ‌మా కాదా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. తాజా ప్ర‌చారంతో గ‌బ్బ‌ర్ సింగ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని ఇచ్చిన హ‌రీష్ కి అలా చెక్ పెట్టేయ‌డం స‌రికాదేమో! అంటూ ఫ్యాన్స్ లో ముచ్చ‌ట వేడెక్కిస్తోంది.

 

 

Related Posts

ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణు: ‘మా’ యుద్ధంలో గెలుపెవరిది.?

సినీ పరిశ్రమలో నటీనటుల సంఘం 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా) వుంది.. అందులో సభ్యుల సంఖ్య వెయ్యి లోపే. అందులో యాక్టివ్ మెంబర్స్ చాలా చాలా తక్కువ. కానీ, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ,...

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ గేమ్ ఛేంజర్ అవుతుందా.?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'లవ్ స్టోరీ' ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. ఈ సినిమా కంటే, నాగచైతన్య - సమంత విడిపోతున్నారా.? కలిసే వుంటారా.? అన్న...

పాపం సాయి పల్లవి కవరింగ్ వర్కవుట్ అవ్వట్లేదాయె

హీరోయిన్ సాయి పల్లవి, 'భోళా శంకర్' సినిమాలో నటించాల్సి వుంది.. అదీ, మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో. కానీ, ఆ సినిమాకి ఆమె 'నో' చెప్పింది. మామూలుగా అయితే, ఇలాంటి విషయాల్లో హీరోలు...

Related Posts

Latest News