2.0 వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత రజనీ నుంచి ఏ రేంజి సినిమా వస్తుంది. అసలు ఎలాంటి సినిమా అందించాలి. అది నిజంగా దర్శకులకు,నిర్మాతలకు తేలని విషయమే. కానీ యంగ్ డైరక్టర్స్ ఆ విషయాన్ని అలవోకగా దాటేస్తున్నారు.
2.0 ఘన విజయం తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పేట్ట. యంగ్ డైరక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ఇప్పటికే ఆడియోను రిలీజ్ చేసిన పేట్ట టీం.. తాజాగా రజనీ పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ టీజర్‌లో పూర్తిగా రజనీ స్టైల్స్ లుక్ మాత్రమే రివీల్ చేశారు. అనిరుథ్ నేపథ్య సంగీతంలో పాటు కార్తీక్ టేకింగ్ సూపర్బ్ అనిపించేలా ఉన్నాయి. అలాగే ఈ టీజర్ చూసిన వారంతా ఒకటే మాట అంటున్నారు.. అసలు ఎలా వస్తాయిరా మీకు ఇలాంటి ఐడియాలు అని. అంతలా కార్తీక్ సుబ్బరాజుని రజనీ ఫ్యాన్స్ మెచ్చేసుకుంటున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖి కీలక పాత్ర పోషించారు. ఇందులో రజనీకాంత్ కాలేజ్ వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.
త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించగా అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.