రెండేళ్ల క్రితం టాలీవుడ్ లో అడుగుపెట్టింది ఆ ముంబై బ్యూటీ. ఆరబోతకు ఏమాత్రం అభ్యంతరం చెప్పని భామగా పాపులరైంది. ఆరంభమే బ్లాక్ బస్టర్ హిట్ సాధించి అటుపై కెరీర్ పరంగా ఆఫర్లు అందుకుంటోంది. అయితే ఈ రెండేళ్లలో తనకు ఎంతో సేవ చేసిన మేనేజర్ ఉద్యోగం తొలగించి ఇప్పుడు బిగ్ షాక్ ఇచ్చిందట. అయితే మేనేజర్ ని అనూహ్యంగా పనిలోంచి తొలగించడానికి కారణం అతడి పని తీరు సరిగా లేదని వాదిస్తోందట. పైగా ఆ మేనేజర్ తనని ఇండస్ట్రీలో డీగ్రేడ్ చేస్తున్నాడన్న సందేహం కూడా వ్యక్తం చేసిందట.
అయితే తనని పనిలోంచి తీసేయడానికి కారణం అది కాదని ఆ మేనేజర్ చెబుతున్నాడు. సదరు యంగ్ బ్యూటీకి ముంబైలో లవర్ ఉన్నాడట. అతడు నటుడిగా దర్శకుడిగా ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్నాడు. హిందీ పరిశ్రమలో ఛాన్సులందుకుంటున్నాడు.
అయితే అతడినే ఇప్పుడు మేనేజర్ గా మార్చేసి తన ఉద్యోగం తొలగించేసిందని సదరు ఎక్స్ మేనేజర్ వాపోతుండడం పరిశ్రమలో చర్చకు వచ్చింది. అసలే కరోనా కష్టకాలం .. ఇలాంటప్పుడు నెలవారీ భత్యం ఖాతాలో పడకపోవడంతో ఆ మేనేజర్ అంతే బెంబేలెత్తిపోతున్నాడు మరి.