ఓటిటిలో “పక్కా కమర్షియల్” సందడికి రిలీజ్ డేట్ రెడీ.!

ఈ ఏడాదికి జూన్ మైండ్ వీక్ నుంచి అలాగే జూలై నెల అంతా కూడా ఒక నైట్ మెర్ అని చెప్పాలి. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా అనుకున్న స్థాయి విజయాన్ని నమోదు చెయ్యలేకపాయింది. అటు ఎంటర్టైన్మెంట్ ఉన్నా కూడా ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరచలేదు.

అలా ఈ జూలై మొదటి తారీఖు లోనే మంచి అంచనాలతో వచ్చిన చిత్రం “పక్కా కమర్షియల్”. మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రం గోపీచంద్ కెరీర్ లో మంచి ఓపెనింగ్స్ ని సాధించింది.

కానీ అనూహ్యంగా ఈ సినిమాలో మేటర్ లేదని తేలిపోవడంతో ఈ సినిమా రెండో రోజు నుంచే వసూళ్లు డ్రాప్ అయ్యిపోయాయ్. కానీ మారుతీ మార్క్ ఎంటర్టైన్మెంట్ అయితే ఈ సినిమాలో కనిపించింది. ఇక ఈ చిత్రం అయితే ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాని రెండు ఓటిటి సంస్థలు నెట్ ఫ్లిక్స్ అలాగే తెలుగు స్త్రీమోంగ్ యాప్ ఆహా వాళ్లు సొంతం చేసుకోగా ఈ చిత్రం ఇప్పుడు ఈ ఆగస్ట్ 5 నుంచి స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి చూడాలనుకొని చూడని వారు అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు చూడొచ్చు.

మరి ఈ సినిమాలో రావు రమేష్ తదితరులు కీలక పాత్రలో నటించగా గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మించారు.