‘దేవ్’ టీజర్…రకుల్ సూపర్ హాట్

తమిళ హీరో కార్తీకి తెలుగు లోను మంచి మార్కెట్ ఉన్నది. ఇటీరవలే కార్తీ నటించిన చినబాబు సినిమా తెలుగులోను మంచి కలెక్షన్సే సాధించింది. తమిళ,తెలుగు ఇలా రెండు చోట్ల మంచి మార్కెట్ ఉండటంతో రెండు ఇండస్ట్రీలపై దృష్టి పెట్టిన కార్తీ ప్రస్తుతం దేవ్ అనే సినిమాను చేస్తున్నారు. కార్తీ ఈసారి మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు.

ఇక ఖాకీ సినిమాతో హిట్‌ పెయిర్‌గా నిలిచిన కార్తీ, రకుల్‌ ప్రీత్‌ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే దేవ్‌ ఫస్ట్‌లుక్‌ను ఇటీవలె విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను దీపావళికి కానుకగా రిలీజ్‌చేసింది చిత్రయూనిట్.

Dev [Telugu] - Official Teaser | Karthi, Rakul Preet Singh | Harris Jayaraj | Rajath Ravishankar

‘ఈలోకంలో బతకడానికి ఎన్నో దారులున్నాయ్‌. ఎవరో చెప్పారని అర్థంకాని చదువు చదివి, ఇష్టంలేని ఉద్యోగం చేసి, ముక్కూ మొహం తెలీని ఓ నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పనిచేసి, ఈగో, ప్రెషర్‌, కాంపిటీషన్‌లో ఇరుక్కుని, అంటీ అంటనట్లు లవ్‌ చేసి, ఏం జరుగుతోందో అర్థంకాకుండా బతకడం ఓ దారి. ఇంకో దారి ఉంది..’ అంటూ హీరో కార్తి చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది.

హారిస్‌ జయరాజ్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. లక్ష్మణ్‌కుమార్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.