NTR – Samantha: ఎన్టీఆర్ తో మరోసారి సమంత జోడి

NTR – Samantha: ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ – ఎన్టీఆర్‌ల కాంబోలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. జనతా గ్యారేజ్ లాంటి చిత్రం తర్వాత మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సమంత ఇప్పటివరకు బృందావనం, రామయ్యా వస్తావయ్య, రభస, జనతా గ్యారేజ్ చిత్రాల్లో కలిసి నటించారు. అందులో రెండు సినిమాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని మెప్పించగా మరో రెండు చిత్రాలు కొంత నిరాశపర్చాయి. ఆ రెండు సినిమాలు కూడా కమెర్షియల్‌గా నిరాశపర్చినప్పటికీ.. ఎంటర్‌టైన్మెంట్ పరంగా ఎన్టీఆర్, సమంత అక్కినేని ఫ్యాన్స్ అందరికీ నచ్చిన సినిమాలే. ఇదిలావుండగా తాజాగా వీళ్లిద్దరి కాంబోలో ఐదో సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది.

జనతా గ్యారేజ్ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ తన 30వ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. పొలిటికల్ సినిమాలోథ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ వెళ్లనుంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన సమంతనే హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు ఫిలింనగర్ టాక్. కొరటాల ‘జనతా గ్యారేజ్’ సామ్ హీరోయిన్ గా నటించడంతో మరోసారి ఎన్టీఆర్ పెయిర్ గా ఆమెను అనుకున్నారంట. ఈ మేరకు సమంతతో సంప్రదింపులు సైతం జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అనౌన్సమెంట్ చేయనున్నట్లు తెలుస్తుంది.