అటు ఇటు చూసి లిప్ లాక్ కిస్ పెట్టేసాడు

కన్నుగీటి అందరిని ఒక్ససారిగా ఫిదా చేసి పారేసిన ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ తొలి సినిమా ‘ఒరు అడార్‌ లవ్‌’ లవర్స్ డే కానుకగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఒమర్‌ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోషన్‌ అబ్దుల్‌ రహూఫ్‌ హీరోగా నటించారు. సుఖీభవ సినిమాస్‌ సంస్థ నిర్మించింది‘లవర్స్‌ డే’ టైటిల్‌తో తెలుగులో విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్‌ విడుదలైంది.

https://www.youtube.com/watch?time_continue=56&v=ldK_hZq7VWU

రొమాంటిక్‌గా ఈ టీజర్ ని రూపొందించారు. ‘ఏంటి?.. ఏమీ లేదు.. ఏమీ లేదా!.. ఇది చెప్పడానికేనా నన్ను రమ్మన్నావు.. అది మన మధ్య.. మన ఇద్దరికీ ఇంత త్వరగా సెట్‌ అవుతుందని నేను అనుకోలేదు..’ అంటూ ప్రియా వారియర్‌, రోషన్‌ల మధ్య సాగే సీన్ ని టీజర్‌లో చూపించారు. ఇద్దరి నటన చూడటానికి చక్కగా అనిపించింది. షాన్‌ రెహమాన్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది.

అలాగే రీసెంట్ గా ఈ చిత్రంలోని ఓ పాటను యూనిట్ విడుదల చేసింది. ‘ఫ్రీక్‌ పిల్లా..’ అని సాగే ఈ పాటకు షాన్‌ రెహమాన్‌ చక్కటి సంగీతం అందించారు. దినకర్‌, నీతు పాటను ఆలపించారు. ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కోసం ఎదురుచూస్తున్నామని కామెంట్లు చేశారు.

 గత ఏడాది ఈ సినిమాలోని ఓ పాట ప్రోమోను విడుదల చేశారు. అందులో ప్రియా వారియర్‌ కన్నుగీటిన తీరు అందర్నీ కట్టిపడేసింది. యువతలో ఆమెకు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. అప్పట్లో ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌.. ఇలా ఎక్కడ చూసినా ప్రియా వారియర్‌రే కనిపించారు. రాత్రికి రాత్రే ఆమె స్టార్‌ అయిపోయారు. ఆమె ఇంతగా పాపులర్‌ కావడంతో కేవలం మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేయాలని యూనిట్‌ భావించింది.

ప్రియా వారియర్‌ ప్రస్తుతం తన రెండో సినిమా ‘శ్రీదేవి బంగ్లా’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆమెకు నేచురల్‌‌ స్టార్‌ నాని సరసన నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం.