`రంగస్థలం` చిత్రంలో రంగమ్మత్త క్యారెక్టర్ ఎంత బ్లాస్ట్ అయ్యిందో తెలిసిందే. సమంత ప్రధాన నాయిక అయినా అనసూయ పాత్రతోనూ మ్యాజిక్ చేశాడు సుక్కూ. మహానటి లో మధురవాణి పాత్ర అంతే ప్రత్యేకం. కీర్తి సురేష్ టైటిల్ పాత్రకు న్యాయం చేకూరిస్తే.. జర్నలిస్టు పాత్రకు సమంత న్యాయం చేయగలిగింది. హీరోయిన్ తో మెయిన్ ట్రాక్ రన్ చేస్తూనే దర్శకులు ఆ పాత్రల్ని తీర్చిదిద్దిన తీరు మెప్పించింది. అందుకే ఈ ఫార్ములాని తెలుగు దర్శకులు అంత తేలిగ్గా విస్మరించరు.
ఫార్ములాని రిపీట్ చేస్తూ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ సినిమాలోనూ ఈ తరహాలో ఓ పాత్రను తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ అందాల నాయిక దీపిక పదుకొనే ఈ చిత్రంలో ప్రధాన నాయికగా నటిస్తుండగా.. ఇందులో మరో నాయికకు స్కోప్ పెంచారట దర్శకుడు. ఆ పాత్రలో మలయాళీ బ్యూటీ నివేద థామస్ నటిస్తుందని ప్రచారమవుతోంది. ఇక నివేద నటించిన ప్రతిసినిమాకి తనే పెద్ద ప్లస్ అవుతోంది. అందుకే ప్రభాస్ 21 చిత్రానికి తన పాత్ర కూడా అస్సెట్ అవుతుందని నాగ్ అశ్విన్- అశ్వనిదత్ బృందం భావిస్తున్నారట.
సాయి పల్లవి.. నివేద థామస్.. అనసూయ లాంటి భామల కోసం ప్రత్యేకించి క్యారెక్టర్లు రాసేందుకు దర్శకులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇది వీళ్లందరికీ పెద్ద ప్లస్ అవుతోంది. దాదాపు బాహుబలి 2 రేంజ్ బడ్జెట్ తో ప్రభాస్ 21 సినిమాని తెరకెక్కించాలన్నది వైజయంతి మూవీస్ ప్లాన్. బాహుబలి- ఆర్.ఆర్.ఆర్ చిత్రాల దర్శకుడు రాజమౌళితోనే పోటీపడే రేంజులో అల్లుడు నాగ్ అశ్విన్ ని దత్ ప్రమోట్ చేస్తున్నారు. భారీ తారాగణం టెక్నికల్ టీమ్ ని ఎంపిక చేసారు. గ్లామర్ తోనూ హీట్ పెంచే ఆలోచన ఉంది. అందుకే ఇద్దరు కథానాయికలతో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాదిలో ప్రభాస్ 21 సినిమను పట్టాలెక్కించి 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.