జెంటిల్‌మెన్, నిన్ను కోరి, జైలవకుశ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ను ఖాతాలో వేసుకుంది నివేదా థామస్. తెలుగులో ఈమె నటించిన పలు చిత్రాలు వరుసగా విజయవంతమవుతూండటంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఆమె నటించిన మూడు చిత్రాలు వరుస హిట్ కొట్టడం తో ఆనందంతో మురిసిపోతోంది. అయితే ఆ మధ్య చదువు కోసం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన నివేదా.. మళ్లీ వరసపెట్టి పలు ప్రాజెక్ట్‌లతో బిజీ అయ్యారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నివేదా.. తాజాగా ఓ వీడియోను పోస్ట్‌చేశారు. ఆ వీడియోలో నివేదా డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మీరు ఇక్కడ ఆ వీడియోని చూడవచ్చు.
How to enjoy a party? Throw your heels away and get dancing! #bridesquad 🤟🏼 #orkeepthemonifyalike 😉 pic.twitter.com/sfJEMKOpEK
— Nivetha Thomas (@i_nivethathomas) November 25, 2018
ప్రభుదేవా హీరోగా వచ్చిన గులేభకావలి సినిమాలోని సాంగ్‌కు.. నివేదా వేసిన స్టెప్స్ అదిరిపోయాయని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. తన సోదరులతో కలిసి ఆడిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
‘మీరు పార్టీని ఎలా ఎంజాయ్ చేస్తార?.. మీ హీల్స్‌ను విసిరేయండి..వెళ్లి డ్యాన్స్‌చేయండి’ అంటూ కామెంట్‌తో పాటు వీడియోను పోస్ట్ చేశారు. నిఖిల్ హీరోగా చేస్తోన్న‘శ్వాస’ సినిమాలో నివేదా హీరోయిన్‌గా నటిస్తోంది.
ఒక సినిమా హిట్ అవడం ప్రత్యేకమని, మొదటి మూడు సినిమాలను అభిమానులు బాగా ఆదరించారని ఆమె అంటోంది. తెలుగు చిత్ర పరిశ్రమ సొంత మనిషిలా చూసిందని..ఇంతకన్నా పెద్ద ప్రశంస ఏమీ ఉండదన్నారు. దీనిన తాను ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు..అభిమానులకు, కుటుంబసభ్యులకు ఎలా ధన్యవాదాలు చెప్పినా తక్కువేనన్నారు.