మలయాళ బ్యూటీ నివేదా థామస్ కెరీర్ లో జై లవకుశ మినహా భారీతనం నిండిన సినిమాలేవీ లేవు. అయితే ఎట్టకేలకు తమిళ్-తెలుగులో దర్బార్ మరో క్రేజీ మూవీగా రిలీజవుతోంది. ఈ సినిమా తనకు ఏమేరకు కలిసి రానుంది? అన్నది తేలనుంది. నేడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. దర్భార్ లో రజినీకి కూతురుగా కనిపించనుంది. కథలో కీలకమైన ఈ రోల్ పై ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతుంది. నివేదా ఈ చిత్రంలో కొందరు యువకుల చేతిలో అత్యాచారానికి గురవుతుందట. ఆ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోవడంతో రజిని పోలీస్ అధికారిగా వారిపై పగ తీర్చుకుంటాడట. నివేదా పై వచ్చే సన్నివేశాలు చాలా హృద్యంగా.. కలచివేసేవిగా ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సంక్రాంతి రేసులో తొలి సినిమా రజనీ దే. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకోనుందో చూడాలి. ఈ చిత్రాన్ని మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రజినీకి హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఇక చెన్నయ్ సహా మెట్రోల్లో దర్బార్ టికెట్ సేల్ అదిరిందని తెలుస్తోంది.