ఈ మధ్యకాలంలో పాటల లిరిక్స్‌ను టైటిల్‌గా పెడుతున్న సినిమాలు ఎక్కువగానే వస్తున్నాయి. ముఖ్యంగా నితిన్ ఈ స్క్రీమ్ ని గత కొంతకాలంగా ఫాలో అవుతున్నారు. గతంలో నితిన్ నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ (పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌లోని ‘దిల్ సే’ పాటలోని లిరిక్), ‘చిన్నదాన నీకోసం’ ( ‘ఇష్క్’ సినిమాలోని ‘చిన్నదాన నీకోసం’ లిరిక్) సినిమాలు ఈ కోవకు చెందినవే.
ఇప్పుడు నితిన్ నటించనున్న కొత్త చిత్రం టైటిల్ కూడా కూడా ‘అ ఆ’ సినిమాలోని ‘రంగ్ దే రే..’ పాటలోని లిరిక్‌ను పోలి ఉంది. నితిన్ 29వ చిత్రానికి టైటిల్ ఖరారైంది. సినిమాకు ‘రంగ్‌దే’ అనే పేరును ఖరారు చేశారు. ‘గివ్ మీ సమ్ లవ్’ అనేది ట్యాగ్ లైన్. వెంకీ అట్లూరీ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించనున్నారు. 2020 వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.