“మాచర్ల నియోజకవర్గం” ట్రైలర్ పై అంచనాలు పెంచుతున్న ఏక్షన్ ధమ్కీ.!

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఓ సరైన హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హీరోల్లో యూత్ స్టార్ నితిన్ కూడా ఒకడు. మరి నితిన్ హీరోగా యంగ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ ఏక్షన్ చిత్రమే “మాచర్ల నియోజకవర్గం”.

దర్శకుడు ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించగా మంచి అంచనాలు పెట్టుకొనే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అయ్యింది. అయితే ఈ చిత్రం నుంచి ట్రైలర్ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దీనికి ముందే చిన్న మాస్ ట్రీట్ అన్నట్టు మాచర్ల యాక్షన్ ధమ్కీ ని రిలీజ్ చేస్తున్నామని తెలిపారు.

మరి దీనిని ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేయగా ఇది అంచనాలు నిలిపే దానిలా ఉందని చెప్పాలి. ఒక ఎమోషన్ తో “మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని కాపాడ్డానికి.. నా సమాధిని పునాదిగా వేయడానికి, సిద్ధం” అని నితిన్ చెప్పిన డైలాగ్ అలాగే చూపించిన ఏక్షన్ బ్లాక్ లు అంచనాలు మరింత స్థాయిలో పెంచుతున్నాయి.

అలాగే ఇంకో పక్క దీనికి మహతి స్వర సాగర్ ఇచ్చిన స్కోర్ కూడా డీసెంట్ గా ఉంది. మరి మాస్ లో అయితే మంచి అంచనాలే ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. అది తెలియాలి అంటే ఈ ఆగస్ట్ 12 వరకు ఆగాల్సిందే.