దోచుకోవడం తగ్గింది: ‘నన్ను దోచుకుందువటే’(మూవీ రివ్యూ)

                                                 (సికిందర్)

రివ్యూ : ‘నన్ను దోచుకుందువటే’

రచన – దర్శత్వం : ఆర్‌.ఎస్‌.నాయుడు
తారాగ
ణం: సుధీర్బాబుభా టేశ్నాజర్తులసిసుదర్శన్,  వైవా ర్ష, జీవా దితరులు
సంగీతం: అజనీశ్ లోక్నాథ్ఛాయాగ్రణం: సురేశ్ గుతు
బ్యానర్ : సుధీర్బాబు ప్రొడక్షన్స్
నిర్మాత
 : సుధీర్బాబు
విడుదల : సెప్టెంబర్ 21
, 2018


మా రేటింగ్ 2.5 / 5

***
          సుధీర్ బాబు నిర్మాతయ్యాడు. సుధర్ బాబు ప్రొడక్షన్స్ స్థాపించి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. హీరోగా గత ‘సమ్మోహనం’ తో ఫర్వాలేదనిపించుకుని, ఈసారి ఆర్ ఎస్ నాయుడు అనే కొత్త దర్శకుడికి అవకాశమిచ్చి మరో ప్రేమ కథ ప్రయత్నించాడు. తనకున్న ఫాలోయింగ్ కియూత్ ఓరియెంటెడ్ లవ్ స్టోరీని ఆశిస్తుంది బాక్సాఫీసు. నిర్మాతగా ఇప్పుడు తనకి బాక్సాఫీసు ఎంతో ముఖ్యం. మరి బాక్సాఫీసుని కూడా దృష్టిలో పెట్టుకుని అంత వ్యూహాత్మకంగా తన మొదటి కానుకని సమర్పించాడా? ఈ విషయం ఒకసారి పరిశీలిద్దాం…

కథ


 కార్తీక్ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తూంటాడు. పని రాక్షసుడిలా వుంటూ స్టాఫ్ ని వూపిరి పీల్చుకోనివ్వడు. గడువుకంటే ముందే టార్గెట్స్ పూర్తి చేస్తూంటాడు. ప్రమోషన్ తో అమెరికా వెళ్ళాలన్న గోల్ పెట్టుకుని కృషి చేస్తూంటాడు. ఈ నేపధ్యంలో వూళ్ళో  వుంటున్న తండ్రి (నాజర్) నీ, ఇతర బంధువుల్నీ పట్టించుకోడు. తండ్రి మేన కోడలిని చేసుకోమంటాడు. కానీ, ఆమె వేరొకర్ని ప్రేమిస్తున్నట్టు చెప్పేసరికి, తను హైదరాబాదులోనే సిరి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్తాడు కార్తీక్. ఆ అమ్మాయిని చూడాలని తండ్రి హైదరాబాద్ వచ్చేస్తాడు. దీంతో మేఘన (నభా నటేష్) అనే షార్ట్ ఫిలిం నటిని రెండ్రోజులు లవర్ గా  నటించేందుకు ఒప్పించుకుంటాడు కార్తీక్.  ఆమె కార్తీక్ తండ్రికి క్లోజ్ అయిపోతుంది. దరిమిలా కార్తీక్ ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ ప్రేమలో పడి టార్గెట్స్ పూర్తి చేయకపోవడంతో కంపెనీ అధికారులు హెచ్చరిస్తారు. ఇప్పుడు కార్తీక్ తన అమెరికా  గోల్ గుర్తుకొచ్చి,  ప్రేమించలేనని మేఘనకి చెప్పేస్తాడు. ఇద్దరూ విడిపోతారు. విడిపోయిన ఇద్దరూ తిరిగి ఎలా కలుసుకున్నారు? వీళ్ళ కలయికకి దారితీసే పరిస్థితులేవి? కార్తీక్ పెట్టుకున్న అమెరికా గోల్ కి అసలు కారణమేమిటి?…మొదలైన ప్రశ్నలకి సమాధానాలు వెండితెరపై చూడాల్సిందే.

ఎలా వుంది కథ

          కథ పురాతనమైనదే. దీన్ని ఆకర్షణీయంగా చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. వారం వారం రోమాంటిక్ సినిమాలెన్నో విడుదలవుతున్నప్పుడు, ఇంత పోటీని దృష్టిలో పెట్టుకునైనా వెరైటీ చూపించే ప్రయత్నం చేయలేదు. అవే ప్రేమలు అలాగే తీసి రాశిని పెంచుతున్నారు తప్ప, వాసిని కాదు. ఇలాటి కథ కొన్ని వందలసార్లు వచ్చి వుంటుంది. కనీసం ఈ కథని కొత్తగా చూపించే ప్రయత్నం చేసి వుంటే ఓపెనింగ్స్ బావుండేవి. ‘నన్ను దోచుకుందువటే’ పాత హిట్ పాట పల్లవిని టైటిల్ గా పెట్టి ఆకర్షించే ప్రయతం చేశారే తప్ప, అసలు విషయం దగ్గర ప్రేక్షకుల మనసుల్ని దోచుకునే కృషి ఏదీ చేయలేదు. దీన్ని ప్రేమ కథ అనేకన్నా అనగనగా ఓ కుటుంబ కథ అంటే సరిపోతుంది. 

ఎవరెలా చేశారు


          సుధీర్ బాబు నటనలో బాగా ఇంప్రూవ్ మెంట్ చూపించాడు. పూర్తిగా సీరియస్ గా వుండే పాత్ర తనది. పాత్ర, నటన ఎంతో బావున్నాయి గానీ  నిర్మాతగా ఎంపిక చేసుకున్న కథ సహకరించలేదు. క్లయిమాక్స్ లో తండ్రి పాత్ర నాజర్ తో  బరువైన భావోద్వేగాల సన్నివేశంలో సుధీర్ బాబు ఎక్సెలెంట్.  అమెరికా గోల్ అంటూ తను ఇంతకాలం ఎండమావుల వెంట పరుగు తీశాడని,  తండ్రి మాటలతో కనువిప్పయ్యే ఈ ముగింపు సీను ఒక్కటే సినిమా మొత్తానికీ హైలైట్. ఈ మూవీతో తను నటనలో ఇంత పరిణితి సాధించాక ఇక జాగ్రత్తతీసుకుని ఆఫర్స్ ని స్వీకరించాలి. 

కన్నడ హీరోయిన్ నభా నటేష్ నటన ఈ బలహీన ప్రేమ కథకి ఒక మంచి రిలీఫ్. ఈమె వున్న దృశ్యాలన్నీ వెలిగిపోతూంటాయి. చిలిపితనం ప్రదర్శించే స్పీడు క్యారెక్టర్ ఇది. కామెడీ అంతా తనదే. హీరో సెలెక్షన్ బావుంది, హీరోయిన్ సెలెక్షన్ బావుంది- మధ్యలో ప్రేమ కథ బావురుమంది. 
కీలక పాత్రలో నాజర్ కూడా ప్రభావం చూపిస్తాడు. సొంత సినిమా కాబట్టేమో సుధీర్ బాబు ప్రొడక్షన్ విలువలపై బాగా ఖర్చుపెట్టాడు. కెమెరా వర్క్ క్లాస్ లుక్ తీసుకొచ్చింది. కానీ మైనస్ పాటలే. 

చివరికేమిటి


          కొత్త దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు కథనంలో అక్కడక్కడా మెరుపులు మెరిపించాడు. ముఖ్యంగా హీరోయిన్ ఎంట్రీ సీను, చివరి సీనులతో ప్రేక్షకుల్ని స్వీట్ గా చీట్ చేశాడు. క్లయిమాక్స్ లో పెళ్ళయిపోతున్న హీరోయిన్ దగ్గరికి హీరో పరుగెత్తడం వందల సినిమాల్లో వచ్చి వుంటుంది. ఈ పెళ్లి సీనుకి ప్రేక్షకులూహించని ట్విస్టు ఇచ్చాడు. ఇలాటి చమక్కులే మిగతా కథలో కూడా చేసివుంటే ఈ రోమాంటిక్ – ఫ్యామిలీ డ్రామాకి న్యాయం జరిగేది. సినిమా ప్రారంభ సీను ఎంత నీరసంగా వుంటుందో, అంత నత్తనడక మిగతా సినిమా అంతా నడుస్తుంది. అసలు ఇందులో హీరో హీరోయిన్ నుంచి విడిపోయే కారణమే బలంగా లేదు. మేనమామ కూతుర్ని చేసుకోవడానికి అడ్డురాని తన అమెరికా గోల్, హీరోయిన్ విషయంలో అడ్డొచ్చింది. అమెరికా వెళ్ళినా ప్రేమల్నికొనసాగించుకునే వీలున్నప్పుడు కాదనడం దేనికో అర్ధం గాదు. ఈ బలహీన కారణంతో కథ సాంతం బలహీనంగా మారిపోయింది. 

          నిర్మాతగా తొలి ప్రయత్నం చేసిన సుధీర్ బాబు కూడా కంటెంట్ విషయంలోనే బాక్సాఫీసుని సరిగ్గా అర్ధం జేసుకోలేదు. ఫ్యామిలీ కథ తగ్గించి, ప్రేమ కథని హుషారెక్కించేలా తీర్చిదిద్దుకుని వుంటే, బాక్సాఫీసుని బాగా దోచుకునే వాడు.