లాస్ట్ డైలాగ్ అయితే కేక పెట్టించింది

న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ సినిమా టీజర్ ఈ రోజు విడుదలైయింది. 1:28 నిమిషాల నిడివి గల ఈ టీజర్ ను భావోద్వేగభరిత సన్నివేశాలతో నింపేశారు. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘జెర్సీ’ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

JERSEY Official Teaser | Nani, Shraddha Srinath | Gowtam Tinnanuri | Anirudh

పర్ఫెక్షన్ కోసం నాని క్రికెట్‌లో శిక్షణ తీసుకుని మరీ షూటింగ్‌లోకి ఎంటర్ అయ్యాడు. అర్జున్ అనే పాత్రలో నాని మెప్పించనున్నాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్ ‘జెర్సీ’ని సమర్పిస్తున్నారు.

‘నీ వయసు ఇప్పుడు 36 అర్జున్‌. అది ప్రొఫెషనల్‌ స్పోర్ట్స్‌ నుంచి రిటైర్‌ అయ్యే వయసు..’ అనే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ‘పిల్లల్ని ఆడించే వయసులో మనకు ఆటలు ఎందుకు బావా..?’ అని మరో వ్యక్తి నానితో అంటున్నారు. ‘ఎంత ప్రయత్నించినా ఇప్పుడు నువ్వు ఏం చేయలేవు..’ అని ఓ మహిళ నానితో కోపంగా అంటోంది.

అర్జున్ పాత్రలో క్రికెటర్ గా నాని లుక్ బాగుంది. ముఖ్యంగా లాస్ట్ డైలాగ్ ‘ఆపేసి ఓడిపోయినోడు ఉన్నాడు కానీ ప్రయత్నించి ఓడిపోయినోడు లేడు’ అంటూ సాగె డైలాగ్ సూపర్ గా వుంది. చివరగా ఈ టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. టీజర్ చూస్తూంటే ఈ చిత్రం యూత్‌కి బాగా కనెక్ట్ అవడంతో పాటు.. ప్రతిఒక్కరికీ ఓ స్ఫూర్తిదాయక చిత్రంగా మిగిలిపోతుందనపిస్తోంది.

సితార ఎంటెర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2019 ఏప్రిల్ 19న ప్రేక్షకులముందుకు రానుంది.