హాలీవుడ్ నుంచి కథలు, స్టోరీ లైన్స్ ఎత్తుకొచ్చి మనదైన నేటివిటి అద్ది వదలటం మనదేశంలో కొత్తేం కాదు. దాంతో ఏ సినిమా ప్రారంభం అవుతోందన్నా లేదా పోస్టర్, టీజర్ వంటివి విడుదలై కథ గురించిన కొద్దిగా క్లూ దొరికినా ఆ సినిమా ఏంటో పసిగట్టేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా, వెబ్ మీడియా ఇలాంటి కథనాలకు వేదికగా మారుతోంది.
రీసెంట్ గా న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ సినిమా టీజర్ విడుదలైయింది. 1:28 నిమిషాల నిడివి గల ఈ టీజర్ ను భావోద్వేగభరిత సన్నివేశాలతో నింపేశారు. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘జెర్సీ’ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ టీజర్ చూసిన వారంతా …ఈ సినిమా హాలీవుడ్ లో వచ్చిన Invincible (2006)అనే చిత్రం నుంచి కాపీ కొట్టారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒరిజనల్ సినిమాలో ..ఫుట్ బాయ్ ఆటచుట్టూ కథ తిరిగితే ఇక్కడ క్రికెట్ చుట్టూ కథ తిరుగుతుందని చెప్తున్నారు. అదొక్కటి మార్చాడు.. మిగతాదంతా యాజటీజ్ ఉంది అని చెప్పుకుంటున్నారు. అయితే టీజర్ చూసి అప్పుడే కాపీ అని డిసైడ్ చేయాలనుకోవటం మాత్రం పొరపాటే అనేది కొందరి వాదన.
పర్ఫెక్షన్ కోసం నాని క్రికెట్‌లో శిక్షణ తీసుకుని మరీ షూటింగ్‌లోకి ఎంటర్ అయ్యాడు. అర్జున్ అనే పాత్రలో నాని మెప్పించనున్నాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్ ‘జెర్సీ’ని సమర్పిస్తున్నారు.
అర్జున్ పాత్రలో క్రికెటర్ గా నాని లుక్ బాగుంది. ముఖ్యంగా లాస్ట్ డైలాగ్ ‘ఆపేసి ఓడిపోయినోడు ఉన్నాడు కానీ ప్రయత్నించి ఓడిపోయినోడు లేడు’ అంటూ సాగె డైలాగ్ సూపర్ గా వుంది. చివరగా ఈ టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. టీజర్ చూస్తూంటే ఈ చిత్రం యూత్‌కి బాగా కనెక్ట్ అవడంతో పాటు.. ప్రతిఒక్కరికీ ఓ స్ఫూర్తిదాయక చిత్రంగా మిగిలిపోతుందనపిస్తోంది.
సితార ఎంటెర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2019 ఏప్రిల్ 19న ప్రేక్షకులముందుకు రానుంది.