టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్న నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్లో పెట్టేశారు. జయాపజయాలతో సంబంధం లేకుండా విలక్షణ కథలను ఎంచుకుంటున్న ఆయన ఇటీవలే V సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రస్తుతం ‘టక్ జగదీష్’ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా తుది దశకి చేరుకోవడంతో తాజాగా నాని కొత్త సినిమా షూటింగ్ నేడు హైదరాబాదులో గ్రాండ్గా ప్రారంభమైంది. ‘శ్యామ్ సింగరాయ్’ పేరుతో తెర కెక్కిస్తున్న ఈ మూవీకి నాని తండ్రి ఘంటా రాంబాబు క్లాప్ కొట్టారు.
నాని, కృతిశెట్టి, సాయిపల్లవిపై ముహూర్తపు సన్నివేశానికి మేర్లపాక గాంధీ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నాని తండ్రితో క్లాప్ కొట్టించడం విశేషం. రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలను ఈ నెలలోనే ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ట్యాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ డైరెక్షన్ లో నాని నటిస్తోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ ఎస్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.ప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్స్ సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి. గతంలో ఏ సినిమాలో కనిపించని డిఫరెంట్ రోల్ పోషించనున్నారట నాని.