షూటింగ్‌లో ప్రమాదం.. ఆసుపత్రిలో నాని!

ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న నాని.. ఈ సినిమా షూటింగ్ సమయలో గాయపడ్డారని సమాచారం. సెట్స్ పై నానికి యాక్సిడెంట్ కావడంతో వెంటనే అప్రమత్తమైన యూనిట్ సభ్యులు ఆయనను దగ్గరలోని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. నాని గాయాన్ని పరిశీలించిన డాక్ట‌ర్లు ప్ర‌మాదం ఏం లేద‌ని చెప్ప‌డంతో రిలీఫ్ అయ్యారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అయితే ప్రమాదం పెద్దది కాకపోవటంతో ఈ విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది.

ఇక షూటింగ్ క్యాన్సిల్ ప్రమాదం కారణంగా నాని కాలికి గాయం కావడంతో కొన్ని రోజుల పాటు షూటింగ్ క్యాన్సిల్ చేశారు. 10 రోజులు విశ్రాంతి అనంతరం మళ్లీ సెట్స్ పైకి రానుంది గ్యాంగ్ లీడర్ టీమ్. అనుకోని సెలవులు దొర‌క‌డంతో నాని ప్రస్తుతం కొడుకుతో సరదాగా గడుపుతున్నారట. మరో వారం పాటు నాని ఇంటికే పరిమితం అవుతాడని తెలిసింది. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే స‌గానికి పైగా పూర్తైపోయింది.

మనం, 24, హలో లాంటి డిఫరెంట్‌ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో నాని చేస్తూండటంతో ప్రాజెక్టుకు మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో నాని సరసన ఐదుగురు హీరోయిన్స్ నటించబోతున్నారని సమాచారం. అలాగే ఈ సినిమాలో విలన్‌గా RX100 ఫేమ్ కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమిళ సంగీత యువ సంచలనం అనిరుధ్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.