తేడా బొమ్మా?: `మన్మథుడు-2` స్టోరీ లైన్, టాక్
దాదాపు పన్నేండేళ్ల క్రితం వచ్చిన `మన్మథుడు` సినిమా ఇప్పటికీ టీవీల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తాజాగా `మన్మథుడు2` తెరకెక్కింది. ఈ రోజు (ఆగస్టు 9వ తేదీన) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకు చాలా చోట్ల షోలు పడ్డాయి. ఈ నేపధ్యంలో చిత్రం టాక్ , స్టోరీ లైన్ ఏంటో చూద్దాం.
సాంబశివరామ్ ఉరఫ్ సామ్ (నాగార్జున) పోర్చగల్ లో సెటిలైన ఓ తెలుగు ఫ్యామిలికి చెందిన వాడు. తన లవ్ ఫెయిల్యూరు అవటంతో ప్లే బోయ్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూంటాడు. ప్రేమ, పెళ్లి వంటివాటికి దూరంగా ఉంటాడు. జీవితంలో ఎప్పటికి పెళ్లి చేసుకోకూడదు అనుకన్న అతనికి తన తల్లి, కుటుంబ వ్యక్తుల పట్టుదలతో పెళ్లికి ఓకే అనాల్సి వస్తుంది. అందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అవంతిక అనే అమ్మాయిని ..గంటకు ఇంత అని మాట్లాడి తన గర్ల్ ఫ్రెండ్ గా నటించటానికి తీసుకు వస్తాడు. అక్కడ నుంచి ఏం జరిగింది. అవంతికతో అతను ఎలా ప్రేమలో పడ్డాడు వంటి విషయాలు చుట్టూ కథ తిరుగుతుంది.
టాక్ విషయానికి వస్తే..ఇప్పటికే ఈ సినిమా చూసిన వారు చెప్పేదేమిటంటే..మన్మధుడు 2 చిత్రం ఈజీ గోయింగ్ సినిమా. పెద్దగా కథ కానీ, ఎమోషన్స్ కానీ లేవు. ఫార్స్ తో నడిచే ఈ కథలో వెన్నెల కిషోర్ కామెడీ ఒకటే అదీ ఫస్టాఫ్ లో వర్కవుట్ అయ్యింది. హీరో,హీరోయిన్స్ క్యారక్టర్స్ బాగా వీక్ గా ఉండటంతో ఈ రొమాంటిక్ కామెడీ పండలేదు. నాగార్జున మాత్రం తెరపై మరింత యంగ్ గా కనిపించేందుకు ప్రయత్నించారు. ఫైనల్ గా ఈ సినిమా అంత గొప్పగా లేదు. ఫ్యాన్స్ కు నచ్చుతుందేమో కానీ మిగతా వాళ్లకు కష్టం.
అయితే ఈ సినిమా విడుదలవుతున్న ఈ శుక్రవారం నుంచి వరుసగా నాలుగు రోజులు సెలవులు రాబోతున్నాయి. ఆ తర్వాత కూడా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మళ్లీ హాలీడే. వరుసగా సెలవులు రావడంతో ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. `మన్మథుడు-2’ రికార్డు కలెక్షన్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఇంత మంచి రిలీజ్ డేట్ ఏ సినిమాకూ దొరకలేదు. మరి, ఈ వరుస సెలవులను `మన్మథుడు-2` క్యాష్ చేసుకుంటుందో? లేదో? చూడాలి.