నాగార్జున‌… అంత తొంద‌రేలా?

నాగార్జున‌.. హీరోగా అంద‌రికీ సుప‌రిచితుడే. హీరోగానే కాదు.. నిర్మాత‌గా కూడా నాగార్జున స‌క్సెస్‌ఫుల్‌. ఈయ‌న నిన్న ముఖ్య అతిథిగా ఓ  ఫంక్ష‌న్‌కు విచ్చేశాడు. ఆ ఫంక్ష‌న్‌కు ఎవ‌రితో కాదు.. ఆయ‌న త‌న‌యుడు నాగ‌చైత‌న్య న‌టించిన `శైల‌జారెడ్డి అల్లుడు`చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌. ఈ వేడుక‌కి నాగార్జున చాలా త్వ‌ర‌గానే వ‌చ్చారు. అయితే వ‌చ్చినంత త‌ర్వ‌గానే నాగ్ ఫంక్ష‌న్ నుండి వెళ్లిపోయారు. ఈ విష‌యం అంద‌రిని షాక్‌కి గురి చేసింది. నాగ్ రాగానే.. స్టేజ్ ఎక్కేశాడు.. యూనిట్‌ను అభినందించేశాడు. ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి మాయ‌మైపోయాడు. నాగ్‌.. అంత త్వ‌ర‌గా వెళ్లిపోవ‌డం ఇప్పుడు టాక్‌గా నిలుస్తుంది. ఇంత‌కు నాగ్ ఎందుకు వెళ్లిపోయాడని ఆరా తీస్తే.. ఫంక్ష‌న్ జ‌రిగిన కోట్ల విజ‌యభాస్క‌ర్ రెడ్డి స్టేడియంలో ఎ.సి. లేకపోవ‌డ‌మే కారణంగా చెబుతున్నారు. అయితే కొడుకు ఫంక్ష‌న్‌కి ఎ.సి లేక‌పోతే నాగార్జున ఉండ‌లేడా? అని కొంద‌రు అంటున్నారు. నాగ్ అర్ధాంత‌రంగా వెళ్లిపోవ‌డంతో అంత తొందరేలా అని అనుకుంటున్నారు కొంద‌రు. ఇక‌ చైత‌న్య‌, అఖిల్ ఫంక్ష‌న్‌ని పూర్తి చేసుకుని ప‌ని కానిచ్చారు.