కరోనా మహమ్మారీ విలయం కొనసాగుతోంది. అటు అమెరికా ప్రపంచ దేశాలు సహా భారతదేశంలోనూ వైరస్ ప్రభావం అసాధారణంగా ఉందని అర్థమవుతోంది. లాక్ డౌన్లు ఎత్తేయడంతో దేశంలో ప్రమాదం ఇంకాస్త అధికమైంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏమంత బాలేదని పోలీసులు- వైద్యులు రిపోర్ట్ చేస్తున్నారు.
ఇలాంటి టైమ్ లో జనాల్ని కట్టడి చేయడానికి పోలీసులు పడుతున్న శ్రమ చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఓవైపు లాక్ డౌన్లు ఎత్తేసినా జనం గుమిగూడకుండా చూసే బాధ్యత పోలీసులదే. ఇప్పుడే అసలైన సవాల్ ఎదుర్కోనున్నారు. ఇదంతా ఇలా ఉంటే.. ఓవైపు శ్రామిక్ రైళ్లలో ప్రయాణిస్తున్న వలసకూలీలకు సరైన ఆహారం అందక ఇబ్బంది పడుతున్నారు. ఏపీ నుంచి తమిళనాడుకు వెళుతున్న ఓ శ్రామిక్ రైలులో ఆహారం లేక అల్లాడుతున్న కార్మికులకు గుంతకల్లులో పోలీసులు సాయం అందించారు. అందుకు సంబంధించి ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేసిన నాగార్జున వారికి సెల్యూట్ చేశారు. ఏపీ పోలీసులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మన్మథుడు 2 నిరాశపరిచినా ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నారు నాగార్జున. ఇందులో ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా ఎన్.ఐ.ఏ అధికారిగా అతడు సర్ ప్రైజ్ చేస్తారని తెలుస్తోంది. అహీషోర్ సోలొమన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జుననే నిర్మిస్తున్నారు.
Kudos to the police force of the india for their selfless service In the front line of #CoronaPandemic 🙏 to @APPOLICE100 not only You are Protecting you are serving the people 👍💐#FrontLineHeroes #IndiaFightsCorona https://t.co/lwiSXcEhec
— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 26, 2020