Home Tollywood త్రివిక్రమ్ తో విభేధం...రెస్పాండ్ అయిన నాగ్

త్రివిక్రమ్ తో విభేధం…రెస్పాండ్ అయిన నాగ్

త్రివిక్రమ్ తో విభేధం…రెస్పాండ్ అయిన నాగ్

కింగ్ నాగార్జున .. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ మ‌ధ్య ఏదన్నా గొడవైందా అంటూ మీడియాలో వరసపెట్టి కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అందుకు కారణం…రీసెంట్ గా జరిగిన ‘మన్మధుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ‘మన్మధుడు’ డైరెక్టర్ విజయ్ భాస్కర్ గురించి దేవి శ్రీ గురించి మాట్లాడిన నాగ్ ఆ సినిమాకు కథ,మాటలు అందించిన త్రివిక్రమ్ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. అంతేకాకుండా సినిమాలో పంచ్ లకు కూడా విజయ్ భాస్కర్ కె క్రెడిట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో ఆ ఈవెంట్ అయిన వెంటనే త్రివిక్రమ్ ఫాన్స్ …నాగ్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ యుద్దం చేశారు. దాంతో నాగ్ కు…త్రివిక్రమ్ కు మధ్య ఏదో గొడవ జరిగి ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యిపోయారు. ఆ విషయం ధృవికరిస్తున్నట్లూగా నాగ్ మరోసారి మీడియా దగ్గర దొరకిపోయారు.

మ‌న్మధుడు 2 ప్రమోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో త్రివిక్రమ్ తో గ్యాప్ విష‌య‌మై మీడియా నుంచి ఓ ప్రర్శ మీడియానుంచి ఎదురైంది. దానికి నాగ్ స్పందిస్తూ.. “మన్మధుడు కథ నాకు వినిపించింది విజయ్ భాస్కర్.. ప్రతిరోజూ నన్ను కలిసి నాతో పంచ్ లు చెప్పించింది కూడా ఆయనే. అందుకే ఆయన గురించే మాట్లాడాను“ అని అన్నారు. అంతేకాకుండా ఆ డిస్కషన్ ని కట్ చేయటానికి అన్నట్లుగా ..,,నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్!! అంటూ మ్యాట‌ర్ ని డైవ‌ర్ట్ చేసేశారు. దాంతో వీళ్లద్దరి మధ్యా గ్యాప్ వచ్చిందని మీడియా ఖరారు చేసేసింది.

అయితే నాగ్ కు, త్రివిక్రమ్ కు మధ్య ఎందుకు విభేధాలు వచ్చాయి అన్నదానికి రకరకాల కారణాలు వినపడుతున్నాయి. నాగ్ తనతో సినిమా చేయమని త్రివిక్రమ్ ని అడిగాడని ఆయన నో చెప్పాడని అంటున్నారు. మరికొంతమంది అఖిల్ రెండో సినిమాని త్రివిక్రమ్ తో చేద్దామని నాగ్ భావించాడు కానీ అప్పుడు హ్యాండ్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. అసలేం జరిగిందనేది ఇద్దరిలో ఎవరో ఒకరు బయిటకు చెప్తే కానీ క్లారిటీ రాదు.

- Advertisement -

Related Posts

అదృష్టం కొద్దీ అభిజిత్ గెలిచాడట.. మంట పెట్టేసిన మోనాల్

బిగ్ బాస్ షోలో ఉన్నంత వరకు ఒకరకమైన మోనాల్‌ను చూస్తే.. బయటకు వచ్చాక మరో రకమైన మోనాల్‌ను చూస్తున్నట్టుంది. బయటకు వచ్చాక తన పరిస్థితి తాను ఏ స్థానంలో ఉందో తెలుసుకుంది. తన...

కులం పేరుతో పిలిచిన నిర్మాత.. స్టేజ్ మీదే కరెక్ట్ చేయించిన జగపతిబాబు

జగపతి బాబు కులానికి వ్యతిరేకమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా కులాల గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలోనూ కుల భావన ఉంది గానీ తనకు మాత్రం అలాంటి...

ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. ముంబైకి బయల్దేరిన మహేష్ బాబు

మహేష్ బాబు ఫోటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మంచు విష్ణు భార్య వెరానిక బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో సహా ఆ పార్టీలో...

రౌడీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ …”లైగ‌ర్” విజయ్ ఫ‌స్ట్ లుక్ విడుదల

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రంగంలోకి దిగేసాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌, లవ్‌ ఎంటర్‌టైనర్‌...

Latest News