టాలీవుడ్ కి సంబంధించినంతవరకు ‘మన్మథుడు’ అంటే నాగార్జుననే! ఆ టైటిల్ కు ఆయన నూటికి నూరుపాళ్ళు న్యాయం చేశారు, త్రివిక్రమ్ రాసిన పంచ్ లు, అందులో నాగార్జున రొమాంటిక్ నటన ప్రేక్షకులు ఎన్నటికీ మరచిపోరు. ఇప్పుడు ‘మన్మథుడు-2’ రానేవచ్చేసింది. ఆగస్టు 9న విడుదలకు సిద్ధంగా ఉంది. ‘చి.ల.సౌ’ తో ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగార్జున, పి. కిరణ్ నిర్మాతలు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. సమంత ఓ కీలక పాత్రలో కనిపిస్తారు.
అయితే.. ‘మన్మథుడు’ గా నాగ్ కు ఉన్న ఇమేజ్ ని ఈ చిత్రం పెంచుతుందా? లేదా? అని ఇప్పుడు పరిశ్రమ అంతా చర్చించుకుంటున్నారు. ‘మన్మథుడు’ నాగ్ కూడా ఈ విషయంలో టెన్షన్..టెన్షన్ గానే ఉన్నట్టు అంతా చెప్పుకుంటున్నారు. ‘మన్మథుడు’ చిత్రం ఎక్కువ భాగం పారిస్ లోనే తెరకెక్కించారు. ‘మన్మథుడు-2’కి మాత్రం లొకేషన్ మారింది. ఈ చిత్రకథ దాదాపుగా పోర్చుగల్ చుట్టూ తిరుగుతుంది.
హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. అయితే ‘మన్మథుడు’ కీ, ‘మన్మథుడు-2’కీ కథ పరంగా, లొకేషన్స్ప రంగా చాలా వ్యత్యాసాలున్నాయి. బడ్జెట్ పరంగాకూడా. ‘మన్మథుడు-2’ దాదాపు 25 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడున్న నాగార్జున కెరీకు సంబంధించి అంత ఖర్చు అవసరమా? అని కూడా అనుకుంటున్నారు. చూడాలి మరి ఎం జరుగుతుందో.