నాగార్జున ఏమిటి పుస్తకం రాయటం ఏమిటి అనుకుంటున్నారా…అవును ఇప్పుడు నాగార్జున అదే ఉందిట. దాదాపు డబ్బై శాతం వరకూ పూర్తైన ఓ పుస్తకాన్ని ఆయన పుర్తి చేసి విడుదల చేయాలనే ఆలచోనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ పుస్తకం ఎవరు రాయటం మొదలెట్టారు అంటే మరెవరో కాదు ఆయన సన్నిహిత మిత్రుడు స్వర్గీయ శివప్రసాద్ రెడ్డి.
1987లో కామాక్షి మూవీస్ బ్యానర్ ప్రారంభించిన శివ ప్రసాద్ రెడ్డి.. తన కెరీర్ లో ..శ్రావణ సంధ్య, విక్కీ దాదా, ఆటో డ్రైవర్, సీతారామరాజు, ముఠా మేస్త్రి, అల్లరి అల్లుడు, నేనున్నాను, కింగ్, కేడీ, రగడ, బాస్, దడ, గ్రీకు వీరుడు లాంటి ఎన్నో పెద్ద హిట్ సినిమాలను నిర్మించారు. ఆయన సినీ ప్రస్థానం దాదాపు నాగార్జునతోనే కొనసాగింది. ఎక్కువ సినిమాలు నాగ్‌తోనే చేశారు శివప్రసాద్ రెడ్డి.
నాగార్జునతో 11 సినిమాలు తీసిన చరిత్ర శివప్రసాద్ రెడ్డికి ఉంది. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావుతో సుబ్బారావు 12 సినిమాలు తీస్తే.. వీబీ రాజేంద్రప్రసాద్ 13 సినిమాలు తీశారు. అదే తెలుగు ఇండస్ట్రీ రికార్డు. ఇంకో మూడు సినిమాలు నాగార్జున, శివప్రసాద్ రెడ్డి ఇద్దరి కాంబినేషన్‌లో వస్తే.. పాత రికార్డ్స్ బద్దలయ్యేది. ఇదే విషయాన్ని 2013లో వచ్చిన ‘గ్రీకువీరుడు’ ఆడియో వేడుకలో గుర్తుచేసుకున్నారు నాగార్జున. అయితే రగడ, దడ చిత్రాలు శివప్రసాద్ రెడ్డిని ఆర్దికంగా క్రుంగ తీసాయి.
ఆ తర్వాత ఆయన చెన్నై వెళ్లి సెటిల్ అయ్యారు. అయితే నాగార్జునతో డైలీ టచ్ లో ఉండేవారు. నాగార్జునకు తనకు ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటూ ఓ పుస్తకం మొదలెట్టారు. ఆ పుస్తకం పూర్తి కాకుండానే శివప్రాసాద్ రెడ్డి శివసాయిజ్యం పొందారు. దాంతో ఇప్పుడు నాగార్జున ఆ పుస్తకం పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.