సెలబ్రిటీలు అందరు దాదాపు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారానే ఫ్యాన్స్ తో ఎక్కువగా టచ్‌లో ఉంటున్నారు.కేవలం సినిమా విషయాలనే కాదు పర్సనల్ విషయాలని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నెటిజన్స్ తమ అభిమాన హీరోలని ఫాలో అవుతూ వస్తున్నారు.
అయితే కొన్ని సార్లు సెలబ్రిటీల పేరుతో ఫేక్ ఎకౌంట్స్ క్రియేట్ చేసి నెటిజన్స్‌ని తప్పుదోవ పట్టిస్తున్నారు కొందరు. దీనిపై ఒక్కోసారి స్టార్స్ స్వయంగా స్పందించి అది ఫేక్ ఎకౌంట్ అని వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి వస్తుంది. తాజాగా అక్కినేని నాగార్జున కూడా తన ట్విట్టర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ తనది కాదని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇంతకాలం తెలియని వాళ్లు కూడా ఇప్పుడా ఫేక్ ఎక్కౌంట్ ని చూడటం మొదలెట్టారు. దాంతో ఆ ఎక్కౌంట్ కు అనవసరమైన క్రేజ్ వచ్చినట్లైంది.
వివరాల్లోకి వెళితే..
నాగార్జున పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు అకౌంట్ సృష్టించారు. దీన్ని చూసిన నాగ్ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. వేరే వ్యక్తులు తన పేరుతో నడుపుతున్న నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్‌ను షేర్ చేశారు. ‘ఇది నా అకౌంట్ కాదు.. నేను ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరచినప్పుడు కచ్చితంగా మీకు చెబుతా’ అని ట్వీట్ చేశారు.
This isn’t me…!!https://t.co/ExF7bP9PqB
Will definitely update you all when I am on @instagram— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 15, 2019
నాగార్జున ప్రస్తుతం ‘మన్మథుడు 2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. సమంత, కీర్తి సురేశ్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. వెన్నెల కిశోర్, నాజర్, రావు రమేశ్, లక్ష్మి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది. ప్రత్యేకించి నాగ్ లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఆగస్టు 9న ఈ సినిమా విడుదల కాబోతోంది.