డైరక్టర్ ని నమ్మి తప్పు చేసాం,అందుకే :నాగశౌర్య

హీరో నాగశౌర్య  తన తాజా చిత్రానికి తానే కథ రాసుకున్నారు. కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. నాగశౌర్య తన సొంత బ్యానర్‌ ఐరా క్రియేషన్స్‌లో ‘ఛలో’, నర్తనశాల’ తరువాత చేస్తున్న మూడో చిత్రమిది. నర్తనశాల చిత్రం ప్లాఫ్ అవటంతో ఈ చిత్రం కథ తానే రాసుకున్నానని చెప్తున్నారు. ఆ దర్శకుడుని నమ్మి తప్పు చేసానని చెప్తున్నారు. 

నాగశౌర్య రాసుకున్న కథతో.. చిత్రం  శనివారం లాంఛనంగా మాదాపూర్‌లో ప్రారంభమైంది. రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శంకర్‌ ప్రసాద్‌ సమర్పణలో ఉషాముల్పూరి నిర్మిస్తున్నారు. చిత్రంలో నాగశౌర్యకి జంటగా మెహరీన్‌ నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌ కొట్టి స్క్రిప్ట్‌ని డైరెక్టర్‌ రమణ తేజకు అందించారు. పరశురామ్‌ గౌరవదర్శకత్వం వహించారు. దర్శకురాలు నందిని రెడ్డి కెమెరా స్విచాన్‌ చేశారు.

నాగశౌర్య మాట్లాడుతూ ‘ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈనెల13నుంచి మొదలవుతుంది. 70శాతం వైజాగ్‌లో చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. రమణతేజ ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. ఇద్దరం యు.ఎస్‌.లో బూస్టన్‌ ఫిల్మ్‌ స్కూల్లో కలిశాం. మంచి కథ డెఫినెట్‌గా బాగా తీస్తారని ఆశిస్తున్నాను. మెహ్రీన్‌తో కలిసి పని చేయడం ఇదే మొదటి సారి. మా ప్రొడక్షన్‌లో వచ్చిన ఫస్ట్‌ సినిమాకంటే పెద్ద హిట్‌ అవుతుంది” అన్నారు.

హీరోయిన్‌ మెహ్రీన్‌ మాట్లాడుతూ.. మంచి కథతోపాటు బేనర్‌లో పనిచేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

చిత్ర దర్శకుడు రమణ తేజ మాట్లాడుతూ ‘నన్ను నమ్మి మంచి కథ ఇచ్చి డైరెక్టర్‌గా నిలబెట్టిన ప్రొడ్యూసర్స్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. కెమెరామెన్‌ మనోజ్‌ నాకు మంచి మిత్రుడు. ఇద్దరం అదే ఫిలిం స్కూల్‌లో చదివాం. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా వుంటుంది’ అని తెలిపారు.

ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత బుజ్జి మాట్లాడుతూ ‘మా బేనర్‌లో 2వ సినిమాకు డైరెక్టర్‌ని నమ్మి తప్పుచేశాం. ఈసారి సొంతకథ రాసుకున్నాం. ఈసారి అలా జరగదు తప్పకుండా హిట్‌ అవుతుంది’ అని పేర్కొన్నారు.