సూపర్బ్: చైతు-సమంత చిత్రం ‘మజిలీ’ ట్రైలర్ !

‘నిన్ను కోరి’ వంటి ఎమోషనల్ ఎంటర్టైనర్ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మజిలీ’. ‘దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్’ అనే క్యాప్షన్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య, సమంత కలసి నటిస్తున్నారు. దివ్యాంశా కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

రిలీజ్ కు రెడీ అవుతున్న ‘మజిలీ’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ఫిల్మ్‌ నగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌ దీనికి వేదికైంది. నాగార్జున, వెంకటేశ్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఏ మాయ చేశావే, ఆటో నగర్‌ సూర్య, మనం ఇలా వరస సినిమాల్లో నటించిన నాగ చైతన్య, సమంత.. నిజ జీవితంలోనూ ఒక్కటయ్యిన సంగతి తెలిసిందే. వీరి వివాహానంతరం తెరపై మొదటిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం ‘మజిలి’.

నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 5న విడుదల చేస్తున్నట్లు చిత్రనిర్మాతలు తెలిపారు. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విష్ణు వర్మ.