వెధవలకెప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారు

ఏ మాయ చేశావే, ఆటో నగర్‌ సూర్య, మనం ఇలా వరస సినిమాల్లో నటించిన నాగ చైతన్య, సమంత.. నిజ జీవితంలోనూ ఒక్కటయ్యిన సంగతి తెలిసిందే. వీరి వివాహానంతరం తెరపై మొదటిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం ‘మజిలి’. ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్‌ క్రియేట్‌ అవుతుందని, చైతూ కెరీర్ కు కాస్తంత రిలీఫ్ వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ వచ్చేసింది.

‘నీకో సంవత్సరం టైం ఇస్తున్నాను. ఈలోపు నువ్వు సచినే అవుతావో సోంబేరే అవుతావో నీ ఇష్టం’ అంటూ రావు రమేశ్‌ చెప్పే డైలాగ్‌తో, నాగచైతన్య క్రికెట్‌ ఆడుతున్న సన్నివేశంతో టీజర్‌ మొదలైంది. చివర్లో వెధవలకెప్పుడూ మంచి పెళ్లాలే దొరకుకుతారంటూ పోసాని చెప్పే డైలాగ్‌ టీజర్‌కు హైలెట్‌గా నిలిచింది.

MAJILI Movie Teaser | Naga Chaitanya | Samantha | Divyansha Kaushik | Gopi Sundar | Shiva Nirvana

సినిమాలో నాగచైతన్య, దివ్యాంశ కౌశిక్‌ ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత నాగచైతన్యకు సమంతతో పెళ్లి జరుగుతుంది. కానీ మొదట ప్రేమించిన అమ్మాయిని మరిచిపోలేక చైతూ సమంతను దూరం పెడతాడు. ‘నువ్వు నా రూంలోకి రాగలవేమో కానీ నా జీవితంలోకి రాలేవు’ అంటూ కోపంతో నాగచైతన్య సమంతతో అంటాడు. గోపీ సుందర్ ‌అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. ఏప్రిల్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 5న విడుదల చేస్తున్నట్లు చిత్రనిర్మాతలు తెలిపారు. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విష్ణు వర్మ.