ఈ ఏడాది టాలీవుడ్ దగ్గర వచ్చిన పలు దారుణ డిజాస్టర్ సినిమాల్లో అయ్యిన బిజినెస్ కి చాలా తక్కువ వసూళ్లు ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాలు చాలానే ఉన్నాయి. మరి అలాంటి చిత్రాల్లో అయితే అక్కినేని వారి యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా రాశీ ఖన్నా మరియు అవికా గోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం “థాంక్ యూ” కూడా ఒకటి.
దర్శకుడు విక్రమ్ కె కుమార్ లాంటి అతను వేరే వారి కథ తీస్కొని ఓ సినిమా చేయడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. అది కూడా అక్కినేని కుటుంబంతో కాబట్టి మినిమమ్ గ్యారంటీ అని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే నాగ చైతన్య కెరీర్ లోనే ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది.
దీనితో ఈ సినిమా ఫలితం పై అయితే తాను ఇప్పుడు ఓపెన్ అయ్యినట్టుగా తెలుస్తుంది. థాంక్ యూ ప్లాప్ నాకు చాలా డిజప్పాయింటింగ్ గా అనిపించింది అని కానీ ఒక నటుడుగా ఇక ఇలాంటివి తప్పవని సర్ది చెప్పుకున్నాడు.
నా నెక్స్ట్ సినిమా తో డెఫినెట్ గా మంచి కం బ్యాక్ ఇస్తానని నమ్మకంగా చెప్పాడు. మరి తాను అయితే ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ మరియు తమిళ స్టార్ దర్శకుడు వెంకట్ ప్రభు తో ఓ ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నాడు.