ఏ సినిమా లో అయినా అలావచ్చి కొద్ది క్షణాలు కనపడిపోయే సర్పైజ్ క్యారక్టర్స్ గురించి జనం మాట్లాడుకుంటారు. అలాగని అవసరం లేకుండా అలాంటి పాత్రలు పెడితే దెబ్బతింటామని దర్శక,నిర్మాతలు వాటి జోలికి పోరు. తాజాగా రిలీజైన ఓ బేబిలో లో సర్పైజ్ పాత్ర ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా క్లైమాక్స్ లో కనపడే ఆ సర్పైజ్ పాత్రలో ఎవరు కనిపించారో చూద్దాం…
‘మిస్ గ్రానీ’ అనే కొరియన్ మూవీకి తెలుగు రీమేక్‌గా ‘ఓ బేబీ’ సినిమా ఈ రోజు (జులై 5 న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై సురేష్ బాబు దగ్గుబాటి, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ప్రీమియర్ షోస్ కంప్లీట్ చేసుకుంది.
ఈ చిత్రం చివర్లో అలా వచ్చి ఇలా మాయమయ్యే గెస్ట్ గా నాగచైతన్య కనిపించారు. సమంత భర్త నాగచైతన్య కావటం, ఈ సినిమా సమంత ప్రధాన పాత్రలో చేయటంతో ఆ సర్పైజ్ మూవ్ మెంట్ కు మంచి అప్లాజ్ వస్తోంది. ఇప్పటికే అక్కినేని అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు ఈ విషయం తెలుసుకుని. ఇంతకీ ఆ సర్పైజ్ ఎలా కనిపించిందో మాత్రం చెప్పదలుచుకోలేదు. అది తెరపై చూసి ఎంజాయ్ చేయండి.
ఈ చిత్రంలో లక్ష్మి, రావు రమేష్, రాజేంద్రప్రసాద్, ప్రగతి రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి కీలక పాత్రల్లో నటించారు. సాంకేతిక వర్గం: మ్యూజిక్: మిక్కి జె.మేయర్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్ , డైలాగ్స్: లక్ష్మీ భూపాల్, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ, ప్రొడక్షన్ , డిజైన్:జయశ్రీ లక్ష్మీ నారాయణ, నిర్మాతలు: సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యువు థామస్ కిమ్ ,ఆర్ట్: విఠల్.కె, దర్శకత్వం: బి.వి.నందినీ రెడ్డి, నిర్మాణ సంస్థలు: సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్, సహ నిర్మాతలు: విజయ్ దొంకాడ, దివ్యా విజయ్.