Home Tollywood ‘రుద్రవీణ’: పేరు వచ్చింది గానీ .. డబ్బులు పోయాయి

‘రుద్రవీణ’: పేరు వచ్చింది గానీ .. డబ్బులు పోయాయి

చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మాతగా మారి అంజనా ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించినప్పుడు – దర్శకుడిగా వాళ్ల మొదటి ఛాయిస్ బాలచందర్‌ రే. అన్నాహజారే జీవితం స్ఫూర్తిగా, ‘రుద్రవీణ’ కథని మలిచారు బాలచందర్. మద్యపానం వల్ల కలిగే నష్టాన్ని చెప్పడంతో పాటు – కళ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి ఉపయోగపడాలనే గొప్ప సందేశం ఇచ్చిన సినిమా ఇది.

ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా నర్గీస్‌దత్ అవార్డ్ కైవసం చేసుకుంది ‘రుద్రవీణ’. ఇప్పుడెందుకు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాం అంటే.. తాజాగా నాగబాబు ‘నా ఛానల్ .. నా ఇష్టం’ వీడియోలో ‘రుద్రవీణ’ సినిమాను గురించి ప్రస్తావించారు .

“అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో ‘రుద్రవీణ’ మొదటి సినిమా. అన్నయ్యతో ట్రావెల్ చేయాలనే కోరికతో .. అన్నయ్య సూచన మేరకు ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలను చూసుకోవడానికి అంగీకరించాను. ‘శంకరాభరణం’ కమర్షియల్ గా హిట్ కావడమే కాకుండా ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇక ‘సింధుభైరవి’ సినిమా కూడా నాకు బాగా నచ్చడంతో .. అలాంటి సినిమా తీయాలనిపించింది.

బాలచందర్ గారితో మాట్లాడి ‘రుద్రవీణ’ సినిమాను తీశాము. ప్రేక్షకుల ముందుకు రావడానికి ఒకటిన్నర ఏడాది పట్టింది. అప్పట్లో ఒక్క రోజులోనే ఇళయరాజా గారు అన్ని పాటలకు ట్యూన్స్ చేసేశారు. అప్పట్లో 85 .. 90 లక్షల వరకూ బడ్జెట్ అయింది. సినిమా ఫ్లాఫ్ కావడంతో బాధపడ్డాము.

ఆ సినిమా మంచి పేరు తెచ్చినా, ఇప్పుడు అలాంటి కథతో ఎవరైనా వచ్చినా సాహసం చేయలేము. పేరుకి నిర్మాతను నేనే అయినా .. డబ్బులు అన్నయ్యవి. ఈ సినిమాకి గాను ఆయన ఓ 10 .. 15లక్షలు నష్టపోయాడు” అని చెప్పుకొచ్చారు.

- Advertisement -

Related Posts

మద్యం మత్తులో షణ్ముఖ్ హల్‌ చల్.. కార్లు, బైకులను ఢీకొట్టి బీభత్సం !

మద్యం మత్తులో టిక్‌టాక్‌ స్టార్ షణ్ముఖ్ హల్‌చల్ సృష్టించాడు. అతివేగంగా కారు నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. జూబ్లీహిల్స్ వుడ్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు, బైకులను ఢీకొట్టి...

‘వీరమల్లు’ నుండి పవన్ కళ్యాణ్ ఫోటో లీక్ .. పిక్ వైరల్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో హిస్టారికల్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ అభిమానుల్లో లో హై ఓల్టేజ్ క్యూరియాసిటీని...

ఇంట్రెస్టింగ్ పాయింట్.. మొగలి రేకులు సాగర్ రచ్చ!

మొగలిరేకులు సీరియల్ చూడని, ఆ పేరు వినని తెలుగు ప్రేక్షకులు ఉండరు.బుల్లితెరపై మొగలిరేకులు ఓ సంచలనం. అందులోని అన్ని పాత్రలూ ఓ ముద్రను వేశాయి. మరీ ముఖ్యంగా ఆర్కే నాయుడి పాత్రలో సాగర్...

ఆ సినిమా చేయొద్దన్నా వినలేదు.. జేడీ చక్రవర్తి కామెంట్స్

జేడీ చక్రవర్తి సినిమాలు, ఆయన ఎంచుకునే పాత్రలు అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. ట్రెండ్‌ను ఫాలో అవ్వకుండా కొత్తగా ఏదైనా ట్రై చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. అలాంటి జేడీ చక్రవర్తి తాజాగా మీడియాతో ముచ్చటించాడు....

Latest News