అమ్మ బాబోయ్ ఇలా అయ్యాడేంటి.. ‘పుష్ప’రాజ్ కదిలాడు!!

Mythri Movies shares Allu Arjun Pushpa Look

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మొత్తానికి పుష్ప సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు. లాక్డౌన్ కంటే ముందు పుష్ప సినిమాను ప్రారంభించారు. అల్లు అర్జున్ లేకపోయినా ఓ వారం రోజుల పాటు కేరళ అడవుల్లో షూటింగ్ జరిపారు. అయితే కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో కేరళలో ఆ మధ్య షూటింగ్‌లకు అనుమతిని రద్దు చేశారు. అక్కడి నుంచి అల్లు అర్జున్ ఇంటి పట్టునే ఉన్నాడు. పుష్ప అలా మూలన పడింది. తాజాగా ఇన్ని రోజుల తరువాత మళ్లీ పుష్ప సెట్స్‌పైకి వెళ్లింది.

Mythri Movies shares Allu Arjun Pushpa Look
Mythri Movies shares Allu Arjun Pushpa Look

ప్రస్తుతం పుష్ప మారెడుమిల్లిలోని దట్టమైన అడువుల్లో పుష్ప షూటింగ్‌ను ప్రారంభించారు. నవంబర్ 10 నుంచి షూటింగ్‌ను అన్ని జాగ్రత్తలు తీసుకుని మొదలెట్టారు. పుష్ప సినిమా షూటింగ్ మొదలు కాబోతోందని వార్తలు బయటకు రావడంతోనే సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. షూటింగ్ నిమిత్తం హైద్రాబాద్ నుంచి రాజమండ్రికి ఫ్లైట్‌లో వచ్చిన బన్నీని విమానాశ్రయంలో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

ఎయిర్ పోర్టులో బన్నీ కెమెరాలకు చిక్కడం, ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవ్వడం జరిగింది. మళ్లీ తాజాగా బన్నీ ఫోటో ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది. పుష్ప సెట్ నుంచి పుష్పరాజ్ లుక్‌ను మైత్రి బయటకు విడుదల చేసింది. ఇందలో బన్నీని బ్యాక్ సైడ్ నుంచి చూపించారు. రా లుక్‌తో, రింగుల జుట్టు, మాసిన చొక్కాతో రచ్చ చేస్తున్నాడు బన్నీ. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను ఊపేస్తోంది.