ఓహో.. బిగ్ బాస్ ప్లాన్ ఇదా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆమెను రప్పిస్తున్నారు.. ఇక హౌజులో రచ్చే

my village show gangavva to join bigg boss telugu season 4 as wild card entry

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. కరోనా వల్ల ఎక్కడ బిగ్ బాస్ షోను నిర్వహించరో అని అనుకున్నా.. మొత్తానికి షో త్వరలోనే ప్రారంభం కాబోతున్నదని మాటీవీ సిగ్నల్ ఇచ్చింది. ఈ సీజన్ కు సంబంధించిన టీజర్ కూడా విడుదలయింది. అంతేనా.. కంటెస్టెంట్లు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో కొందరి పేర్లు కూడా వైరల్ అయ్యాయి.

my village show gangavva to join bigg boss telugu season 4 as wild card entry
my village show gangavva to join bigg boss telugu season 4 as wild card entry

మొత్తం 14 మంది కంటెస్టెంట్లు వీళ్లే.. అని ఈ లిస్టు ఫైనల్ అని కూడా చెబుతున్నారు. ఆ 14 మంది పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక.. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మాత్రం ఇద్దరిని తీసుకోనున్నట్టు తెలిసింది. కానీ.. ఆ ఇద్దరు ఎవరు అనేదానిపై క్లారిటీ రానప్పటికీ.. ఒకరి పేరు మాత్రం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మై విలేజ్ షో యూట్యూబ్ చానెల్ తో ఫేమస్ అయిన గంగవ్వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నదట. ఆమె ఇక బిగ్ బాస్ షోలోకి వచ్చిందంటే హౌజులో రచ్చే. తెలంగాణ యాసలో అచ్చం పల్లెటూరు భాషలో ఆమె మాట్లాడే మాటలకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

తన వీడియోల్లో ఆమె మాట్లాడే మాటలు, పెట్టే ముచ్చట్లు ఎంతో వినోదాన్ని పంచుతాయి. ఇక గంగవ్వ బిగ్ బాస్ షోలోకి వస్తే.. మిగితా కంటెస్టెంట్లతో ఆమె పెట్టే ముచ్చట్లు, ఆమె చేసే సందడితో షోకు కొత్త కళ వస్తుందని బిగ్ బాస్ షో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

my village show gangavva to join bigg boss telugu season 4 as wild card entry
my village show gangavva to join bigg boss telugu season 4 as wild card entry

ఒకవేళ గంగవ్వ హౌజ్ లో ఉంటే ఖచ్చితంగా షో టీఆర్పీ రేటింగ్స్ పెరిగినట్టే. షోలో వినోదం కూడా పెరిగినట్టే.. అని అంతా భావిస్తున్నారు.

అయితే.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గంగవ్వతో ఇప్పటికే బిగ్ బాస్ షో యాజమాన్యం సంప్రదింపులు జరిపిందట. తనను క్వారంటైన్ కు కూడా పంపించారట. అయితే.. తనను మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానే షోలోకి తీసుకురావాలని బిగ్ బాస్ భావిస్తున్నాడట. చూద్దాం.. మరి గంగవ్వ బిగ్ బాస్ హౌజులోకి ఎంట్రీ ఇస్తుందో లేదో?