మహేష్ ట్వీట్ కు మురగదాస్ కు సౌండ్ లేదట..తేరుకుని రిప్లై

మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ ప్లాఫ్ ఇచ్చింది మురగదాస్. ఎంతో మోజుపడి చేసిన స్పైడర్ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దాంతో ఇక ఎప్పుడూ మురగదాస్ ని దగ్గరకు రానివ్వడని, ఆయన ప్రసక్తి తేవటానికి మహేష్ ఇష్టపడరని అంతా అనుకున్నారు. అందరూ అనుకున్నట్లుగా ఉంటే మహేష్ గొప్పతనం ఏముంది. హిట్స్,ప్లాఫ్స్ లెక్కేసుకుని దర్శక,నిర్మాతలకు దూరమైతే ఏం కలిసొస్తుంది. ఈ విషయం మహేష్ మైండ్ లో జీర్ణించుకోపోయింది. తన తండ్రి కృష్ణలాగే అందరితో మంచిగా ఉండటం నేర్చుకున్నారు. అదే విధంగా…మురగదాస్ తో కూడాను. అయితే ఆ విషయం మురగదాస్ కు తెలియదు కదా.

వివరాల్లోకి వెళితే.. మహేష్ బాబు ఈ మధ్యకాలంలో ట్విట్టర్ లో రెగ్యులర్ గా ట్వీట్స్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. అలాగే రిలీజ్ అవుతున్న లేటెస్ట్ చిత్రాలపై తన అభిప్రాయాలు, అభినందనలు కూడా తెలియచేస్తున్నారు. అదే పద్దతిలో ఆయన విజయ్ దళపతి, మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సర్కార్’ సినిమా గురించి ట్వీట్ చేసారు.

మహేష్ బాబు ‘సర్కార్’ చిత్ర టీమ్ కి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. సినిమాని బాగా ఎంజాయ్ చేశానని.. మురుగుదాస్ ట్రేడ్ మార్క్ సినిమా అంటూ ట్వీట్ చేశారు.

ఇక ఈ ట్వీట్ మొదట మురగదాస్ కు ఆశ్చర్యం కలిగించిట. అసలు ఆయన ఊహించని అభినంందన ఇది. తనపై చాలా కోపంగా ఉంటారనుకున్న మహేష్ ..ఇలా ట్వీట్ చేయటం కలలో కూడా ఊహించలేదట. దాంతో మహేశ్ ట్వీట్‌కు మురుగదాస్ కూడా సమాధానమిచ్చారు. ‘సార్ కృతజ్ఞతలు… మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు.