హీరోయిన్ సాక్షి శివానంద్ పై హత్యాయత్నం కేసు!
తనను అంతమొందించేందుకు అక్క సాక్షి శివానంద్, ఆమె అత్త ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేసింది శిల్పా ఆనంద్. ఈ విషయాన్నీ తన ఫేస్ బుక్ పేజీ వేదికగా పంచుకుంది. తనను, తన తల్లిని హత్య చేయడానికి తన సోదరి సాక్షి శివానంద్ అత్త ‘భావన బ్రహ్మభట్’ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.
తమను అంతమొందించి ఇన్సురెన్స్ డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. భావన తన భర్తను సైతం హత్య చేసిందని.. దీనిపై తన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపింది. హత్య అనంతరం భావన అమెరికా వెళ్లిపోయిందని.. భావన కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారని.. భారత్‌కు వస్తే అరెస్ట్ ఖాయమని పేస్ బుక్ వేదికగా ఆరోపించింది. కాగా 2003లో మంచు విష్ణు తొలి సినిమా ‘విష్ణు’తో శిల్పా ఆనంద్ తెరంగేట్రం చేశారు.
తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘మాస్టర్’, ‘ఇద్దరు మిత్రులు’ వంటి సినిమాల్లో నటించిన సాక్షి శివానంద్ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ తర్వాత యువరాజు, సింహరాశిలాంటి ఎన్నో సినిమాలు చేసిన సాక్షి శివానంద్ .. కెరీర్ మంచిగా సాగుతున్న దశలో పెళ్లి చేసుకుంది.
తాను సినిమాల్లో చేస్తున్న సమయంలో తన సోదరి సాక్షి ఆనంద్ ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఇప్పుడు ఆమె సోదరి సాక్షి ఆనంద్ తన అక్క, ఆమె అత్తపై కేసు పెట్టింది తాను ఈ కేసు ఫైల్ చేసే సమయంలో విదేశాలకు వెళ్లిపోయారని పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది సాక్షి ఆనంద్. మరి దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.