కార్తీ ‘దేవ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది

కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దేవ్’.ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ ను మొదలెట్టింది చిత్రం టీమ్. అందులో భాగంగా ఈ రోజు చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు.

Dev [Telugu]  Theatrical Trailer | Karthi,RakulPreet | Harris Jayaraj | Rajat Ravishankar

ట్రైలర్ లో కార్తి ఎడ్వంచర్స్ ని ఇష్టపడే వ్యక్తిగా కనిపిస్తున్నారు. అతని సరసన రకుల్ ప్రీతి సింగ్ చేస్తోంది. ఆమె ను ప్రేమలో పడేయటం కూడా ఓ ఎడ్వంచర్ గా దేవ్ భావిస్తాడు. ఎడ్వంచర్స్ తో కూడిన ప్రేమ కథగా ఈ చిత్రం రూపొందుతోందని అర్దం అవుతోంది. మీరు కూడా ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఆడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. హారిస్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహించారు. ‘ఖాకీ’ చిత్రం తర్వాత రకుల్ ప్రీత్ సింగ్, కార్తీ కలయికలో వస్తున్నచిత్రమిది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ పవర్‌ఫుల్ రోల్స్‌లో నటిస్తుండగా, నిక్కీ గల్రాని మరో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకోని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకే సమయంలో విడుదల చేస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా.. రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ సమర్పిస్తోంది.