బిగ్ క్లారిటీ : “గాడ్ ఫాదర్” రిలీజ్ పై క్లారిటీ మీద క్లారిటీ లు..!

ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి అంచనాలు నెలకొల్పుకున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం “గాడ్ ఫాదర్” కూడా ఒకటి. కేవలం మెగాస్టార్ మాత్రమే కాకుండా బాలీవుడ్ బిగ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా అయితే తెరకెక్కిస్తుండగా.. 

ఆల్రెడీ ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ కి ఫిక్స్ చేశారు. ఈ అక్టోబర్ 5 న ఫిక్స్ చేశారు. అయితే సడెన్ గా సినిమా వాయిదా అంటూ అనేక రూమర్స్ మరియు గాసిప్స్ పెద్ద ఎత్తున వైరల్ గా మారగా సాయంత్రం నాటికి చిత్ర యూనిట్ నుంచి నిర్మాత ఎన్ వి ప్రసాద్ నుంచి ఎలాంటి వాయిదా లేదని కన్ఫర్మ్ చేశారు.

ఇక ఇదిలా ఉండగా దీనితో పాటుగా సినీ వర్గాల్లో ప్రముఖ ట్రాకర్స్ కూడా ఇదే స్టార్ట్ చేయగా ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ కూడా రిలీజ్ డేట్ పై మరో క్లారిటీ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ లో హోప్స్ నిలబడ్డాయి. దీనితో అయితే ఈ సినిమా రిలీజ్ పరంగా మాత్రం ఎలాంటి మార్పు లేదని ఇప్పుడు ఫిక్స్ అయ్యింది.

ఇక ఈ భారీ సినిమాలో అయితే దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా నయనతార అలాగే సునీల్ తదితరులు నటిస్తున్నారు. అలాగే కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.