మీరు గొప్ప అంటే వెంటనే అవతలి వాడు మీరేమన్నా తక్కువా..నాలో ఆ గొప్పతానాన్ని గుర్తించిన మీరెంత గొప్ప అంటూ పొగిడేస్తారు.అయితే ఈ పొగడ్తలు వీళ్లద్దరు పర్శనల్ గా చేసుకుంటే ఇద్దరికీ ఆనందం కానీ పబ్లిక్ గా సోషల్ మీడియాలో చేసుకుంటేనే జనాలు వింతగా చూస్తారు..నవ్వుకుంటారు. ఇప్పుడు మోహన్ బాబు, తమిళ హీరో సూర్య విషయంలో అదే జరుగుతోంది.
హీరో సూర్య తదుపరి చిత్రంగా తెరకెక్కుతున్న “సోరారై పోట్రు” లో మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. చెన్నైలో జరిగిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ లో ఈ ఇద్దరు నటులు కలిసి నటించారు. కాగా మొదటిసారి షూటింగ్ లో కలిసిన వీరు మంచి ప్రెండ్స్ అయిపోయినట్లుంన్నారు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు.
Thank you @Suriya_offl for the kind words. Being one of this gen top star, Your discipline and humbleness on sets speaks about your wonderful character. Looking forward for the next schedule, my young friend. https://t.co/f6aCa1rKWl
— Mohan Babu M (@themohanbabu) June 17, 2019
మొదట హీరో సూర్య “నిబద్దత,క్రమశిక్షణ కలిగిన గొప్ప నటుడు మోహన్ బాబు గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది,500 సినిమాల ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానం స్ఫూర్తి దాయకం, “సోరారై పోట్రు” చిత్రంలో నటిస్తున్నందుకు ధన్యవాదాలు” అని ట్విట్టర్ లో ఆయనతో తన వర్కింగ్ ఎక్సపీరియెన్స్ ని పంచుకున్నారు.
దీనికి సమాధానంగా మోహన్ బాబు” నాపై మీకున్న అభిప్రాయానికి ధన్యవాదాలు, అగ్ర హీరో ఐనా కూడా సెట్స్ లో మీ క్రమశిక్షణ,వినయం మీ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. సెకండ్ షెడ్యూలు కోసం ఎదురుచూస్తున్నాను, యంగ్ ఫ్రెండ్” అని కొంచెం ఎమోషనల్ గా స్పందించారు. ఒక్కసినిమా కోసం అది కూడా ఒక్క షెడ్యూల్ లో కలిసి పనిచేసినందుకు వీరిద్దరి మధ్య పెరిగిన స్నేహం , ఈ ట్వీట్స్ చూస్తూంటే సోషల్ మీడియా జనం కొద్దిగా అతిగానే ఉందంటున్నారు.