చూడండి: ప్రధాని మోదీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు ప్రచారం

తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ నటుడు నందమూరి తారక రామారావు రాజకీయ, వ్యక్తిగత జీవితం ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆయన పబ్లిసిటీని చాలా విభిన్నంగా చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఈరోజు ప్రధాని మోదీ గుంటూరు సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటంపై వర్మ స్పందించారు. ఆ వీడియోను షేర్ చేసారు. చంద్రబాబుని ఉద్దేశించి మోడి..మీరు ఫలానా విషయంలో సీనియర్..ఫలానా విషయంలో సీనియర్..మీ మామకు వెన్నుపోటు పొడవటంలో సీనియర్ అంటూ ఎద్దేవా చేసారు. వెన్నుపోటు పొడవటం అనే విషయం పట్టుకున్న వర్మ దాన్ని హైలెట్ చేస్తూ ట్వీట్ చేసారు.

వర్మ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఈ వీడియోను 21.44 నిమిషాల నుంచి చూడండి. ప్రధాని మోదీ స్వయంగా మా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు ప్రచారం చేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. దీనికి ఓ తెలుగు వార్తా ఛానల్ ప్రసారం చేసిన వీడియోను జతచేశారు.

PM Modi Speech at Guntur Public Meeting | Comments on TDP Govt | Part 1| ABN Telugu

ట్రైలర్ ను ప్రేమికుల దినోత్సవం(ఫిబ్రవరి 14న) రోజున ఉదయం 9.27 గంటలకు విడుదల చేస్తానని వర్మ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.