“గాడ్ ఫాదర్” తో మళ్ళీ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న చిరంజీవి.!

ప్రెజెంట్ టాలీవుడ్ దగ్గర రిలీజ్ కి సిద్ధంగా ఉన్నటువంటి పలు చిత్రాల్లో ఒక మెగా మల్టీ స్టారర్ లా వస్తున్న చిత్రం “గాడ్ ఫాదర్” కూడా ఒకటి. తెలుగు మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ లు నటించిన ఈ చిత్రం తెలుగు మరియు హిందీలో మంచి అంచనాలు పెట్టుకొని రిలీజ్ కాబోతుంది.

అయితే ఇదంతా బాగానే ఉంది నిన్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రాక వరకు ఫ్యాన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. కానీ మళ్ళీ మెగాస్టార్ లుక్స్ పట్ల అభిమానుల్లో కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఒక్క ఈ సినిమా విషయంలో మొదటిసారి గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు మెగాస్టార్ లుక్స్ చూసి చాలా షాకయ్యారు.

కానీ తర్వాత టీజర్ లో చూసి ఫ్యాన్స్ పర్వాలేదు అనుకున్నారు కానీ నిన్న సాంగ్ లో చిరు ని చూసి మళ్ళీ షాక్ అవుతున్నారు. అసలు చిరు సాంగ్ అంటేనే తన గ్రేస్ తో అద్భుతంగా లాగేస్తారు. అలాంటిది సాంగ్ లో తన లుక్ బాగా డిజప్పాయింట్ చెయ్యడం మెగా ఫ్యాన్స్ కి అసలు మింగుడు పడడం లేదు.

పక్కన సల్మాన్ ఖాన్ నే చిరు ని డామినేట్ చెయ్యడం మరో విశేషం. మరి సినిమాలో కూడా మెగాస్టార్ ఇలా కనిపిస్తే సినిమాలో బ్లండర్ లా ఇది కనిపిస్తుంది అని చెప్పాలి. ఈ ఒక విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ గా ఉన్నారు.