ట్రేడ్ టాక్: మన్మధుడు 2 బిజినెస్ డీసెంట్
కింగ్ నాగార్జున కెరీర్ బెస్ట్ డిజిటల్ డీల్ ఏది? అంటే .. `మన్మధుడు 2` ది బెస్ట్ అంటూ ట్రేడ్ లో చర్చ సాగుతోంది. ఈ సినిమా టీజర్ .. సింగిల్స్ కి ఇప్పటికే అభిమానుల నుంచి చక్కని రెస్పాన్స్ వచ్చింది. ఆ క్రమంలోనే థియేట్రికల్ బిజినెస్ కి .. డిజిటల్ డబ్బింగ్ రైట్స్ కి డిమాండ్ పెరిగిందట. థియేటర్ రైట్స్ పరంగా ఇప్పటికే డీసెంట్ బిజినెస్ సాగుతోందన్న ముచ్చట ఉంది. నాగార్జున నటించిన దేవదాస్ చిత్రానికి క్రిటిక్స్ ప్రశంసలు దక్కినా బాక్సాఫీస్ వద్ద ఆశించినంత వసూళ్లు తేవడంలో తడబడింది.
అయినా ఆ ప్రభావం `మన్మధుడు 2` బిజినెస్ పై లేదని తెలుస్తోంది. మన్మధుడు నాగార్జున కెరీర్ లో బెస్ట్ హిట్ చిత్రం. అందుకే ఆ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న మన్మధుడు 2 పై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఇటీవల టీజర్ లో ఘాటైన రొమాన్స్ ని చూపించడంతో యువతరంలోనూ ఆసక్తి క్రియేటైంది. ఇక బిజినెస్ వర్గాల్లోనూ దీనిపై పాజిటివ్ బజ్ నెలకొందట. తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రఖ్యాత ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుందని తెలుస్తోంది. మన్మధుడు 2 రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ ఏకంగా 7.4 కోట్లు చెల్లిస్తోందట. కింగ్ కెరీర్ సోలో బెస్ట్ ఇదే.
ఇక నాగార్జున – నాని నటించిన దేవదాస్ చిత్రానికి 17 కోట్ల మేర డిజిటల్- శాటిలైట్ ధర పలికిందని అప్పట్లో ప్రచారమైంది. నాగార్జున- రకుల్ ప్రీత్ నాయకానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున, జెమిని కిరణ్ నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 9 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.