వైఎస్ బ‌యోపిక్ యాత్ర‌: అమెరికాలో విడుద‌ల‌య్యే థియేట‌ర్ల కంప్లీట్ లిస్ట్‌..!

దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాజ‌కీయ జీవితంలోని అత్యంత కీల‌క ఘ‌ట్టం పాద‌యాత్ర‌. ఈ పాద‌యాత్ర రాష్ట్ర రాజ‌కీయాల‌ను స‌మూలంగా మార్చివేసింది. వ‌రుస‌గా రెండుసార్లు వైఎస్ అధికారాన్ని అందుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మైన పాద‌యాత్ర‌లోని కీల‌క ఘ‌ట్టాల‌ను క‌థాంశంగా తీసుకుని తెర‌కెక్కించిన మూవీ `యాత్ర‌`. వైఎస్ పాత్ర‌ను మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి ఇందులో పోషించారు.

వైఎస్ పాత్ర‌కు ఆయ‌న నిండుత‌నాన్ని తీసుకొచ్చారు. మ‌మ్మూట్టి త‌ప్ప మ‌రెవ‌రో వైఎస్ పాత్ర‌లో న‌టించ‌లేర‌నేంత‌గా పేరు తెచ్చుకున్నారాయ‌న‌. వైఎస్ ట్రేడ్‌మార్క్ పంచెకట్టు, పొడుగు చేతుల జుబ్బా, భుజంపై కండువాతో అచ్చు వైఎస్‌ను త‌ల‌పించారు మ‌మ్మూట్టి. మ‌మ్మూట్టి త‌న పాత్ర‌ను తానే సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం విశేషం.

70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. మ‌హీ వీ రాఘ‌వ్ ద‌ర్శ‌కుడు. మ‌హీ వీ రాఘ‌వ్‌కు ఇది రెండో మూవీ. ఆయ‌న తీసిన తొలి చిత్రం ఆనందో బ్ర‌హ్మ‌. హార‌ర్ కామెడీగా తెర‌కెక్కించిన ఈ సినిమా పెద్ద హిట్‌. తాజాగా ఆయ‌న తీసిన యాత్ర‌పై మంచి హైప్ ఉంది.

ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ సినిమాలో కొద్దిసేపు క‌నిపించ‌బోతున్నారు. ఈ నెల 8వ తేదీన విడుద‌ల కాబోతున్న‌ది యాత్ర‌. అమెరికాలో సుమారు 200కు పైగా స్క్రీన్ల‌పై యాత్ర ప్ర‌ద‌ర్శితం కానుంది. ఆయా థియేట‌ర్ల‌కు సంబంధించిన పూర్తి జాబితా ఇది.