షాకింగ్!! మమ్ముట్టి అలా నటిస్తున్నాడని చెప్పిన ‘యాత్ర’ డైరెక్టర్

వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన ముఖ్యమంత్రులందరిలో విశిష్టమయిన వ్యక్తిత్వం ఉన్నవాడు.
వేషం,భాష, వ్యక్తిత్వం, ప్రజలతో సంపర్కం,ప్ర త్యర్థులను ఎదుర్కోవడం అన్నింటిలో వైఎస్సార్ ది భిన్నమయిన వ్యవహారం. చెరగని చిరునవ్వు ఆయన సంతకం. ఇలాంటి వ్యక్తి మీద బయోపిక్. ఇందులో వైఎస్సార్ నటిస్తున్న వ్యక్తి వైఎస్పార్ భాషతో, వ్యక్తితో, వ్యక్తిత్వంలో, శైలితో ఏమాత్రం సంబంధం లేని వాడు. ఇటువైపు వైఎస్సార్, అటువైపు మలయాళ మహానటుడు మమ్మూట్టి. ఈ ఇద్దరి మధ్య మిస్ మాచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఈ ఇద్దరి మధ్య అతుకనేది కనిపించకుండా జత చేయాలి. అపుడే వైఎస్సార్ బయోపిక్ సజీవంగా మారుతుంది. ఇది డైరెక్టర్ కు విసిరే ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ను వైఎస్సార్ బయోపిక్ డైరెక్టర్ మహి వి రాఘవ్ ఎలా ఎదుర్కొంటాడనే టెన్షన్ , ఈ చిత్ర నిర్మాతలకు, వైఎస్సార్ అభిమానులకు ఉంటుంది. అలాంటిదేమీ అవసరంలేదనంటున్నాడు రాఘవ్. నాకు అలాంటి జటిల సమస్య ఎదురుకాకండా మమ్మూట్టి వైఎస్సార్ పాత్రలో వొదిగిపోయాడు. ఈ విషయాన్ని ఆయన ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదీ డైరెకర్ మహి వి రాఘవ్ నిజాయితీ.

ఈ బయోపిక్ ‘యాత్ర’ షూటింగ్ ప్రారంభయ్యి కొద్దిరోజులే అయ్యింది. అయినప్పటికీ వైఎస్సార్ పాత్రలో ఇప్పటికే పరకాయ ప్రవేశం చేశారు మమ్ముట్టి అని చెబుతున్నాడు డైరెక్టర్.దర్శకుడు మహి వీ రాఘవ్. తాజాగా ఈ బయోపిక్ విశేషాలను ఈ ఇంటర్వ్యూలో ముచ్చటించాడు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా 2003 లో వైఎస్సార్ చేప్పట్టిన పాదయాత్ర నేపథ్యంలో తీస్తున్న ఈ సినిమాలో వైఎస్సార్ గా నటిస్తున్న మమ్ముట్టిని నేను డైరెక్ట్ చెయ్యట్లేదు కేవలం అతనిని సహకరిస్తున్నా అనిపిస్తుంది నాకు. ఆయన ఒక సీన్లో నటించిన తర్వాత నేను కరెక్షన్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంత బాగా ఆ పాత్రలో ఒదిగిపోయారు. నేను ఈ పాత్రకి కొన్ని మార్పులు చేర్పులు చేసి డ్రమాటిక్ గా తీసుకురావాలి అని ఆలోచిస్తుంటే ఆయన వద్దని చెప్పారు. వైఎస్సార్ నిజజీవితంలో ఎలా ఉన్నారో అలానే ఉండాలని కోరుకున్నారు మమ్ముట్టి. ఈ పాత్రని ఆయన అంతబాగా అన్వయించుకున్నారంటే ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. నేను కేవలం నా విజన్ చెప్తే దానికి తగ్గట్టుగానే నటిస్తారు. కథ విన్న తర్వాత మమ్ముట్టి స్వయంగా వైఎస్సార్ గురించి రీసెర్చ్ చేశారు. ఆయనకున్న మేనరిజంపై పట్టు సాధించారు.

ఆయన హావభావాలు అందరికీ గుర్తుండే ఉంటాయి కానీ మేము రాజశేఖరెడ్డిని అనుకరించాలి అనుకోవట్లేదు. కేవలం ఆయన పాత్రని బాగా చూపించాలి అనుకుంటున్నాం.. మమ్ముట్టిగారితో అది సాధ్యమవుతుంది. మలయాళ మెగాస్టార్ తెలుగులో ఇంతకుముందు కూడా యాక్ట్ చేశారు కానీ ఇది ఆయనకు ఒక ఛాలెంజింగ్ రోల్. ఆయన ఎన్నో సినిమాల్లో నటించిన గొప్ప నటుడు. ఎన్నో విజయాలు సాధించారు. ఇప్పుడిక కష్టపడాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు కూడా తన తెలుగు డైలాగ్స్ అన్ని మలయాళంలో రాసుకుని వాటికి అర్ధాలు తెలుసుకుంటారు. తెలుగు పదాలను స్పష్టంగా పలకటానికి ప్రయత్నిస్తుంటారు ఎందుకంటే వైఎస్సార్ తెలుగు మాట్లాడే విధానం డబ్ చేయటం అంత సులువైన విషయం కాదు. ఉచ్ఛరించడంలో పొరపాటైతే ప్రేక్షకులు విమర్శించే అవకాశం ఉంటుంది అని తెలియజేసాడు.

వైఎస్సార్ పాత్రకి మలయాళ హీరోని ఎందుకు పెట్టుకున్నారు అని మహి వీ రాఘవని అడుగగా ఇలా సమాధానం చెప్పాడు. నేను చెన్నై, చిత్తూరులో పెరిగాను. మలయాళం మూవీస్ ఎక్కువగా చూసేవాడిని. ఆయన చుట్టూ ఒక ఆరా ఉంది. ఆయన సెట్స్ లో తిరుగుతున్నా, కూర్చున్నా, మాట్లాడినా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు తన నటనతో ఆయన నా పనిని చాలా సులభం చేసేశారు అని చెప్పాడు.

ప్రస్తుతం ‘యాత్ర’ షూటింగ్ 30 % పూర్తి చేసుకుందట. 20 సంవత్సరాల తర్వాత మళ్లీ తెలుగులో నటిస్తున్న మమ్ముట్టి తన మార్క్ క్రియేట్ చేస్తారని అంచనా. నేను ఈ టేక్ బావుంది ఫైనల్ చేయొచ్చు అనుకున్నా మెగాస్టార్ మమ్ముట్టి మాత్రం కాంప్రమైజ్ అవ్వరు. ఇంకా బెటర్ గా చేయొచ్చు అని అభిప్రాయపడతారు. ఆయనకు ఈ సీన్ ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అని సొంతంగా జడ్జ్ చేసుకునే సెన్స్ ఉంది అని నా అభిప్రాయం. సీన్ ఎలా ఉంటె బావుంటుందో నాకంటే ఆయనే బాగా నిర్ధారించగలరు అని మమ్ముట్టి గురించి చెప్పాడు డైరెక్టర్ మహి వీ రాఘవ్.