ఓవైపు కరోనా వైరస్ కలవరం మామూలుగా లేదు. ఆ క్రమంలోనే వైరస్ పై సినిమాలపైనా దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. 2011లో రిలీజైన హాలీవుడ్ చిత్రం కంటాజియాన్ ని ఆన్ లైన్ లో వీక్షించేవారి సంఖ్య అమాంతం పెరిగిందన్న చర్చ సాగుతోంది.
ఆ క్రమంలోనే మలయాళంలో అబూ ఆషిక్ తెరకెక్కించిన `వైరస్` చిత్రంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ మూవీలో 2018లో కేరళను తాకిన నిపా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని తెరపై ఎంతో ఉద్విగ్న భరితంగా ఆవిష్కరించింది. వందలాది ప్రాణాల్ని బలిగొన్న నిపాని ఎదుర్కొనేందుకు కేరళ ప్రభుత్వం ఎంత సమర్థంగా చర్యలు చేపట్టింది ? అందుకే కేంద్రం సాయం ఎలా జరిగింది? అధికారులు .. ప్రజల స్పందన ఎలా ఉంది? అన్నవి తెరపై చూపారు. ఇక వైరస్ మూలాల్ని కనుక్కునేం దుకు సాగిన పరిశోధనల్ని తెరపై చూపారు. ఇక ఈ మూవీ కరోనా నివారణకు ఒక ప్రాతిపదికగా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ చూడాలన్న ప్రచారం తాజాగా తెరపైకొచ్చింది. ఈ మూవీలో సామాన్య ప్రజల్లో ఎమోషన్ ని రగిలించే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయని చెబుతున్నారు. మరి వైరస్ మూవీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటే వీక్షించేయవచ్చు. డిజిటల్ స్ట్రీమింగులోనూ దొరికే వీలుంటుందేమో!
