చిరు ఫాం హౌస్‌లో అగ్నిప్రమాదం.. ‘సైరా’ సెట్ బూడదైంది

వేసవి కాలం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా భారీ ఖర్చుతో నిర్మించే సెట్స్ విషయంలో సినిమావాళ్లు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కోసారి అవేమీ కలిసిరావు. ఇప్పుడు అలాంటి పరిస్దితే చోటు చేసుకుంది. చిరంజీవికు చెందిన ఫాంహౌస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.

అందుతున్న సమాచారం మేరకు హైదరాబాద్ కోకా పేటలో చిరంజీవి ఫాంహౌస్‌లో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. చిరంజీవి తాజా చిత్రం సైరా నర్సింహారెడ్డి చిత్రం నిర్మాణం కోసం ఫాంహౌజ్‌లో సెట్ నిర్మించారు. ఆ సెట్టింగ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.ప్రమాదంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అలాగే, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సినిమా సెట్ దాదాపు బూడిదైనట్టు సమాచారం. దీంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్టు సమాచారం. అయితే అగ్ని ప్రమాదానికి ఎందుకు జరిగింది ..ఎలా జరిగింది అనే కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.