‘మహర్షి’ ఫస్ట్ సింగిల్ ‘ఛోటీ ఛోటీ బాతే..’ వచ్చేసింది

వంశీ పైడిపల్లి – మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మహర్షి’. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో… పూజా హెగ్డే హీరోయిన్. వంశీ పైడిపల్లి దర్శకుడు. అశ్వనీదత్‌, దిల్‌రాజు, పీవీపీ నిర్మాతలు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ‘ఛోటీ ఛోటీ బాతే..’ అంటూ సాగే పాటను ఫస్ట్ సింగిల్ గా శుక్రవారం ఉదయం విడుదల చేసారు. ఆ పాట విడుదలైన వెంటనే రికార్డ్ లు క్రియేట్ చేసే దిసగా పరుగులు పెడుతోంది. మీరు ఇక్కడ ఆ పాట వీడియోను చూడచ్చు.

Choti Choti Baatein Lyrical | Maharshi Songs | MaheshBabu,PoojaHegde, AllariNaresh |VamshiPaidipally

‘‘ప్రతి స్నేహానికి ఓ కథ ఉంది. ఈ పాట వింటూ మీ కథని గుర్తు చేసుకోండి. మీ స్నేహాన్ని ఉత్సవంగా జరుపుకోండి’’ అంటూ దర్శకుడు ట్వీట్‌ చేశారు. ఉగాదిన టీజర్‌ విడుదల చేస్తారని సమాచారం.

వచ్చే మే నెల 9 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.