హిట్టైన సినిమాని ఎవరైనా రీమేక్ చేస్తారు..డిజాస్టర్ సినిమాని రీమేక్ చేసి హిట్ కొట్టినవాడే మొగాడు అనుకున్నారో ఏమో కాని ఇప్పుడు తమిళంలో అలాంటి ప్రయత్నమే ఒకటి జరుగుతోందని వినికిడి. బంధాలు, ఆత్మీయతలు, అనురాగాలు తదితర విషయాల చుట్టూ సుదీర్ఘంగా తిరిగిన సినిమా బ్రహ్మోత్సవం. ఈ సినిమా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే మెగా డిజాస్టర్ గా మిగిలిపోయింది.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఇప్పటిదాకా కోలుకున్నది లేదు. అంతకు ముందు ఇదే కాంబినేషన్ లో చేసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో మధ్యతరగతి కుటుంబంలోని ప్రేమలని, అనుబంధాలని సహజంగా ఆవిష్కరించింది. దాంతో ఈ కాంబోపై అంచనాలు పెరిగిపోయాయి. వన్ పర్శంట్ ని కూడా అందుకోలేకపోయింది. ఇప్పుడా సినిమాని తమిళంలో రీమేక్ చేస్తున్నట్లు సమాచారం.
తమిళ్ లో దర్శక నిర్మాత మరియు నటుడు అయిన చేరన్ ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వినపడుతోంది. ఆ మధ్య ఈ సినిమా చూసిన చేరన్ ఈ సినిన్మలో తమిళ ప్రేక్షకులకు బాగా నచ్చే అంశాలు ఉన్నాయని అందుకని తాను ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేయాలని అనుకుంటునట్టు చెబుతున్నారు. అక్కడి నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కిస్తే సినిమా పెద్ద హిట్టయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన నమ్ముతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చేరన్ ఈ విషయాన్ని వెళ్లడించాడు.
అయితే ‘బ్రహ్మోత్సవం’ వంటి సినిమాను మహేష్ బాబు ఎలా చేశాడంటూ ఇప్పుడు కూడా ఆశ్చర్యపోయేవాళ్లు ఉన్నారు. వారంతా ఈ రీమేక్ వార్త విని ..చేరన్ కు మైండ్ దొబ్బిందా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కించే అవకాశం కూడా ఉంది. మొత్తానికి తమిళ ఆడియన్స్ ముందుకు ‘బ్రహ్మోత్సవం’ చిత్రం రీమేక్ అయ్యి వెళ్లబోతుంది.ఎంతకీ ఏ హీరో ఈ సినిమాలో చేస్తారో ..లేక చేరన్ స్వయంగా నటిస్తాడో చూడాలి.